ఇవాళ కాంగ్రెస్‌ రెండో విడత విజయభేరి యాత్రకు బ్రేక్‌

Today is the Break for the Second Phase of Congress Vijayabheri Yatra
x

ఇవాళ కాంగ్రెస్‌ రెండో విడత విజయభేరి యాత్రకు బ్రేక్‌

Highlights

Congress: కాసేపట్లో ఢిల్లీకి టీకాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ ముఖ్యనేతలు

Congress: తెలంగాణలో కాంగ్రెస్‌ తలపెట్టిన రెండో విడత విజయభేరి యాత్రకు ఇవాళ బ్రేక్‌ పడింది. కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు టీకాంగ్రెస్‌ స్ర్కీనింగ్‌ కమిటీ ముఖ్యనేతలు. కేసీ వేణుగోపాల్‌తో వారు సమావేశం కానున్నారు. పెండింగ్‌లో ఉన్న 19 స్థానాలతో పాటు.. వామపక్షాలతో పొత్తులపై చర్చించనున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు ఇస్తామన్న చెరో రెండు స్థానాలపై కాంగ్రెస్‌ కొత్త మెలిక పెట్టింది. సీపీఐకి కొత్తగూడెం మాత్రమే కేటాయించే ప్లాన్‌లో కాంగ్రెస్‌ ఉన్నట్టు తెలుస్తోంది. చెన్నూరు బరిలో హస్తం పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తోంది. సీపీఎంకు మిర్యాలగూడ లేదా వైరాలో ఒకటి ఇవ్వడానికి కాంగ్రెస్‌ మొగ్గు చూపుతోంది. కాంగ్రెస్‌ తీరుతో సీపీఎంలో కాస్త కన్ఫ్యూజన్‌ నెలకొంది. దీంతో.. పొత్తులు, స్థానాల కేటాయింపుపై రెండురోజుల్లో తేల్చాలని హస్తం పార్టీకి సీపీఎం డెడ్‌లైన్‌ విధించింది.

కాంగ్రెస్‌ రెండోవిడత విజయభేరి యాత్రకు ఇవాళ బ్రేక్‌ పడగా.. రేపు యథావిధిగా యాత్ర కొనసాగనుంది. నాగార్జునసాగర్‌, కొల్లాపూర్‌ యాత్రల్లో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. కొల్లాపూర్‌లో పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగిస్తారు. ఇక.. నవంబర్ 1, 2 తేదీల్లో యాత్రలో పాల్గొననున్నారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ.

Show Full Article
Print Article
Next Story
More Stories