Top
logo

నేడు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు

నేడు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు
Highlights

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు తొలి...

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు తొలి బోనం సమర్పించారు. తెల్లవారుజామున 4గంటల 5నిమిషాలకు అమ్మవారికి బోనం సమర్పించారు. తెలంగాణలో వర్షాలు బాగా కురిసి పాడిపంటలతో రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి ప్రార్థించినట్టు మంత్రి తలసాని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం మంచిగా జరుగుతుందన్నారు. ఈ బోనాలకు భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తలసాని తెలిపారు.


లైవ్ టీవి


Share it
Top