Mamata Banerjee: తెలంగాణకు దీదీ ఎక్స్‌ప్రెస్‌

*దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించాలనే యోచనలో దీదీ *తెలంగాణలో టీఎంసీ టీమ్ పర్యటన

Shilpa
Updated on: 8 Oct 2021 3:45 PM IST
TMC Team Visiting Telangana and Meeting with Former MPs
X
మమతా బెనర్జీ (ఫైల్ ఫోటో)

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో విజయం సాధించి జోరు మీదున్న దీదీ పార్టీ ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో పార్టీని విస్తరించే దిశగా మమతా బెనర్జీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిలో భాగంగా తెలంగాణలో టీఎంసీ టీమ్ పర్యటించినట్లు సమాచారం. తాజా, మాజీ ఎంపీలతో టీఎంసీ ఎంపీల బృందం భేటీ అయినట్లు తెలుస్తోంది.

గడ్దిపూల పార్టీ ఏం చెప్పబోతోంది? టీఎంసీ బృందంతో భేటీ అయిన ఆ నేతలు ఎవరు? టీఎంసీ ఎంపీల ఫ్రెండ్లీ పార్టీ వెనుక మతాలబేంటి అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలయ్యింది. నందిగ్రామ్‌లో సువేంద్ అధికారి చేతిలో ఓటమిపాలైన మమతా బెనర్జీ , ఆ తర్వాత భవానీపూర్‌లో జరిగిన ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై 58వేల మెజార్టీతో మమతా బెనర్జీ విజయం సాధించారు.


Shilpa

Shilpa

Next Story