Mulugu: ములుగు జిల్లాలో పెద్దపులి సంచారంతో కలకలం

Tiger Wandering in Mulugu District
x

ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం (ఫైల్ ఇమేజ్)

Highlights

Mulugu: ములుగు మండలంలోని నాలుగు గ్రామాలలో పులి సంచారం ఆనవాలు

Mulugu: ములుగు మండలం పెగడపెల్లి, లాలయిగూడెం, జగ్గన్నగూడెం, అంకన్నగూడేం గ్రామల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం అడవికి మేతకు వెళ్లిన పశువులు తిరిగి ఇంటికి రాకపోవడంతో పశువుల యజమాని గ్రామస్తులతో అడవిలో పరిశీలించగా ఆవుపై పులి దాడి చేసినట్లు గుర్తించారు. వెంటనే గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పెగడపల్లి గ్రామానికి చెందిన మరో ఇద్దరి రైతుల పశువులు కూడా అడవికి వెళ్లి మూడు రోజులు గడిచిన ఇంటికి తిరిగి రాకపోవడంతో వీటిపై కూడా పులి దాడి చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పులి సంచార సమాచారంతో ఏజెన్సీ గ్రామస్తులు ఇళ్లకే పరిమితమయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories