తెలంగాణలోని పలు జిల్లాల్లో పులుల కలకలం

Tigers terror in Telangana
x

తెలంగాణలో పులుల సంచారం (ఫైల్ ఫోటో)

Highlights

* స్థానికులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నపులులు * కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 2 నెలలుగా చిక్కకుండా ముప్ప తిప్పలు పెడుతున్న పులి * నిర్మల్‌ జిల్లా కుభీర్‌ మండలం బ్రహ్మేశ్వర్‌ తండా శివారులో చిరుతపులి దాడిలో ఆవు మృతి

తెలంగాణలోని పలు జిల్లాల్లో పులులు కలకలం సృష్టిస్తున్నాయి. పులుల అలజడికి స్థానికులకు కంటిమీద కునుకు ఉండటం లేదు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పులి రెండు నెలలుగా చిక్కకుండా ముప్ప తిప్పలు పెడుతోంది. ఆ పులిని పట్టుకునేందుకు రెండు రోజులుగా డ్రోన్‌ కెమెరాలను వినియోగిస్తున్నారు.

ఇటు నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామంలో చిరుతపులి సంచరిస్తోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అలాగే, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్‌ శివారులోని వ్యవసాయ బావిలో కనిపించిన చిరుతపులి తప్పించుకుంది. అంతకుముందు చిరుతను బయటకు రప్పించడానికి నిచ్చెనలు ఏర్పాటు చేశారు. బహుశ చిరుత నిచ్చెన ద్వారా బయటకు వచ్చేసి ఉంటుందని బావిస్తున్నారు.

ఇక, నిర్మల్‌ జిల్లా కుభీర్‌ మండలం బ్రహ్మేశ్వర్‌ తండా శివారులో చిరుతపులి దాడిలో ఆవు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మరోవైపు మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం శివారులో ప్రయాణికుల ఆటోను చిరుతలు వెంబడించాయి. శుక్రవారం రాత్రి గ్రామ శివారులోని డంపింగ్‌యార్డు వద్ద మూడు చిరుతలు రోడ్డుకు అడ్డంగా వచ్చాయి. వాటిని తప్పించుకొని వెళ్లడానికి ప్రయత్నించగా ఆటోను వెంబడించాయి. ఆ సమయంలో ఆటోలోని ప్రయాణీకుల టెన్షన్ వర్ణనాతీతం. ఐతే, చిరుతలు కొంతదూరం వెంబడించి ఆగిపోయాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories