భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి కలకలం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి కలకలం
x
Highlights

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. చండ్రుగొండ మండలం సీతాయిగూడెం గ్రామ శివారులో పెద్దపులి పాదముద్రలు కనిపించడంతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. చండ్రుగొండ మండలం సీతాయిగూడెం గ్రామ శివారులో పెద్దపులి పాదముద్రలు కనిపించడంతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. పెద్దపులి సంచారంపై అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రమాస్తుల సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పులి పాదముద్రలను గుర్తించారు. పెద్దపులి సంచరిస్తుందన్న విషయాన్ని దృవీకరించిన అధికారులు.. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే పెద్దపులి గ్రామస్తులకు కనిపిస్తే ఎలాంటి హాని తలపెట్టకుండా స్వచ్ఛందంగా అటవీ ప్రాంతంలోకి పులి వెళ్లేలాగా సహకరించాలన్నారు.

మరోవైపు.. ఈ మధ్య కాలంలో తెలంగాణ వ్యాప్తంగా పులుల సంచారం తీవ్ర భయాందోళన రేకెత్తిస్తోంది. హైదరాబాద్‌ సహా రాష్ట్ర వ్యాప్తంగా పులులు అడవులను వదిలి ప్రజావాసాల్లోకి రావడం పెద్ద సవాల్‌గా మారుతోంది. జంతువులపైనే కాకుండా మనషులపై కూడా ఈ పులులు దాడులు చేస్తున్నాయి. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతోందో అన్న భయంతో అటవీ ప్రాతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ల దీస్తున్నారు.

కుమ్రుంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇద్దరిపై పెద్దపులి దాడి చేసి చంపేసిన నేపథ్యంలో.. పులి పేరు వినపడితేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీనికితోడు మూడురోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి అటవీప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్టు గుర్తించారు స్థానికులు. తెల్లవారుజామున ఓ ఆవుపై పెద్దపులి దాడి చేసినట్టు చెబుతున్నారు. రాత్రి కాపలాకు వెళ్లిన రైతులు కేకలు వేయడంతో పులి అక్కడినుంచి పారిపోయినట్టు వెల్లడించారు. ఈ రెండు ఘటనల నేపధ్యంలో అటవీశాఖ అధికారులు పెద్దపులిని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories