సీట్ల లొల్లి.. రాజగోపాల్‌, కాంగ్రెస్‌ దిష్టిబొమ్మ దహనం చేసిన చలమల వర్గం

Ticket Panchayat in Congress
x

సీట్ల లొల్లి.. రాజగోపాల్‌, కాంగ్రెస్‌ దిష్టిబొమ్మ దహనం చేసిన చలమల వర్గం

Highlights

Congress: మునుగోడు టికెట్‌ రాజగోపాల్‌కు ఇవ్వడంతో కాంగ్రెస్‌ కార్యకర్తల ఆందోళన

Congress: కాంగ్రెస్‌లో టికెట్ల పంచాయితీ తారాస్థాయికి చేరుకుంటోంది. మునుగోడు టికెట్‌ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఇవ్వడంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాజగోపాల్‌రెడ్డితో పాటు.. కాంగ్రెస్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు చలమల వర్గం నేతలు. ఇదిలా ఉంటే.. ఇవాళ కార్యకర్తలతో సమావేశం కానున్నారు చలమల కృష్ణారెడ్డి. భవిష్యత్‌ కార్యాచరణపై ఆయన నిర్ణయం తీసుకోనున్నారు. తుర్కయాంజల్‌లో పాల్వాయి స్రవంతి, పున్న కైలాష్‌ నేత.. కార్యకర్తలతో ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు. చలమల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి, పున్న కైలాష్‌ నేత.. మునుగోడు కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories