Siddipet: సిద్దిపేట లాల్‌ కమాన్‌ దగ్గర అర్ధరాత్రి ఉద్రిక్తత

*కేసీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేయడానికి దుండగుల యత్నం *పోలీసుల ఆధ్వర్యంలో విగ్రహం తొలగించిన అఖిలపక్షం నేతలు

Shilpa
Published on: 22 Nov 2021 11:17 AM IST
Thugs Tried at Mid Night to Set up KCR Statue on Lal Kaman
X

సిద్దిపేట లాల్‌ కమాన్‌(ఫైల్ ఫోటో)

Siddipet: సిద్దిపేట చారిత్రాత్మక కట్టడమైన లాల్‌ కమాన్‌పై దుండగులు కేసీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అడ్డుకున్న ప్రజాప్రతినిధులు విగ్రహాన్ని తొలగించి లాల్‌ కమాన్‌ దగ్గర బైటాయించారు. అపవిత్రం జరిగిందన్న భావంతో లాల్‌ కమాన్‌ను శుద్ధి చేయాలని అఖిలపక్షం భావిస్తోంది. అమ్మవారి సాక్షిగా శుద్ధి చేయడానికి సంకల్పించారు.

పవిత్రమైన లాల్‌ కమాన్‌ను అపవిత్రం చేసిన టీఆర్ఎస్‌ నాయకులు కేసీఆర్‌ బతికి ఉండగానే ఆయన విగ్రహం పెట్టడం ఏంటని మండిపడుతున్నారు. లాల్‌ కమాన్‌పై విగ్రహ పెట్టడం దుర్మార్గమైన చర్య అంటున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Shilpa

Shilpa

Next Story