సెల్ఫీ దిగుతుండగా రిజర్వాయర్‌లో పడిపోయిన ముగ్గురు అమ్మాయిలు

X
Highlights
సెల్ఫీ మోజు ప్రాణాలు తీసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఎడపల్లి మండలం అలీసాగర్ రిజర్వాయర్ దగ్గర సెల్ఫీ దిగుతూ ముగ్గురు అమ్మాయిలు ప్రమాదవశాత్తు రిజర్వాయర్‌లో పడిపోయారు.
admin15 Nov 2020 3:50 PM GMT
సెల్ఫీ మోజు ప్రాణాలు తీసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఎడపల్లి మండలం అలీసాగర్ రిజర్వాయర్ దగ్గర సెల్ఫీ దిగుతూ ముగ్గురు అమ్మాయిలు ప్రమాదవశాత్తు రిజర్వాయర్‌లో పడిపోయారు. ఈత రాకపోవడంతో ఊపిరాడక ముగ్గురు అమ్మాయిలు మృత్యువాత పడ్డారు. ఒకరిని కాపాడబోయి మరొకరు నీళ్ళల్లో పడిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానాకుల ద్వారా తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతులు బోధన్ పట్టణం రాకాసిపేటకు చెందిన జుబేరా, మీరాజ్, మషేరాగా గుర్తించారు. ఈ విషాద ఘటనతో బాధిత కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే మృతి చెందిన ముగ్గురు 16 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం.
Web TitleThree girls died in nizamabad district
Next Story