Top
logo

భద్రాద్రి సీతారాముల కల్యాణం నేడే.. ఈ సారి భక్తులు లేకుండానే

భద్రాద్రి సీతారాముల కల్యాణం నేడే.. ఈ సారి భక్తులు లేకుండానేభద్రాద్రి సీతారాముల కల్యాణం (File Photo)
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలోని శ్రీ సీతారాముల కల్యాణం ప్రతీ ఏటా కన్నుల పండుగగా జరుగుతుంది అన్న విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం లోని శ్రీ సీతారాముల కల్యాణం ప్రతీ ఏటా కన్నుల పండుగగా జరుగుతుంది అన్న విషయం తెలిసిందే... ఈ జానికి రాముడి వివాహ మహోత్సవాన్ని చూసేందుకు భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరై తిలకిస్తారు. కానీ ఈ సారి కరోనా ప్రభావం భద్రాచలం రాములోరిపైనా పడింది. ఈసారి భక్తులు లేకుండానే శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సారి రాములోరి కల్యాణాన్ని తిలకించే యోగ్యం భక్తులకు దక్కడం లేదు.

ఈ కల్యాణోత్సవాన్ని జరగవలసిన అన్ని ఏర్పాట్లను ఆలయ అధికారులు ఇప్పటికే ఏర్పాటు చేశారు.. ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో ఈ వేడుకలు జరగనున్నాయి. శ్రీ సీతారామచంద్రులకు ప్రభుత్వం త‌ర‌పున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముత్యాల తలంబ్రాలు, ప‌ట్టు వ‌స్త్రాలను స‌మ‌ర్పిస్తారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా సీతారామల కల్యాణ వేడుకలు భక్తులు లేకుండానే జరగనున్నాయి.కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో భక్తులు ఎవరికివారే స్వచ్ఛందంగా దర్శనం వాయిదా వేసుకొని ఇంట్లోనే పూజలు నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.ఆలయాలలోని ప్రధాన అర్చకులు పూజలు నిర్వహించనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వైష్ణవ ఆలయాలలో పూజలు యధాతధంగా జరుగుతాయని వెల్లడించింది.

Web TitleThis time Sriramanavami celebrations will be held without devotees
Next Story