Vande Bharat Express: తెలంగాణ నుంచి మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్

Third Vande Bharat Express From Telangana
x

Vande Bharat Express: తెలంగాణ నుంచి మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్

Highlights

Vande Bharat Express: వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ

Vande Bharat Express: తెలంగాణ నుంచి మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది. ఇప్పటికే సంక్రాంతి గిఫ్ట్‌గా సికింద్రాబాద్-విశాఖపట్టణం వందేభారత్ రైలు, ఉగాది కానుకగా సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును కేంద్రం ప్రారంభించగా.. ఇప్పుడు వినాయక నవరాత్రుల కానుకగా.. నేడు కాచిగూడ-బెంగళూరు వందే భారత్ రైలును ప్రారంభించనుంది. మధ్యాహ్నం పన్నెండుర గంటలకు కాచిగూడలో ఈ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఢిల్లీ నుంచి ప్రధాని మోడీ ఈ రైలును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అయితే మిగతా వందేభారత్ రైళ్ల తరహాలో కాకుండా ఇందులో కేవలం ఎనిమిది కోచ్‌లు మాత్రమే ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories