పబ్‌కు వచ్చిన దొంగ... పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై కాల్పులు

Thief opened fire at police
x

వీకెండ్‌లో గచ్చిబౌలి పబ్‌కు వచ్చిన దొంగ... పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై కాల్పులు

Highlights

Thief opened fire at police: హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. గచ్చిబౌలిలో శనివారం సాయంత్రం ఒక దొంగ పబ్ కు వచ్చాడని తెలుసుకున్న...

Thief opened fire at police: హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. గచ్చిబౌలిలో శనివారం సాయంత్రం ఒక దొంగ పబ్ కు వచ్చాడని తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకునేందుకు అక్కడికి వచ్చారు. పోలీసులను చూడటంతోనే ఆ దొంగ వారిపైకి రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు.

ఆ వ్యక్తి జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ సీసీఎస్ పోలీసు స్టేషన్ కు చెందిన వెంకట్రామ్ రెడ్డి అనే కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. కానిస్టేబుల్ తొడకు బుల్లెట్ గాయమైంది. అదే పబ్ లో పనిచేస్తోన్న మరో బౌన్సర్ కూడా ఈ కాల్పుల్లో గాయపడ్డారు. గాయపడిన ఇద్దరిని పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

రెండు రౌండ్లు కాల్పులు జరిపి తప్పించుకునేందుకు యత్నించిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన నేరాల చిట్టాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న ప్రభాకర్ అనే నిందితుడే ఈ దొంగ అని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories