సంగారెడ్డి జిల్లాలో వైన్‌షాపులో దొంగతనం

Theft in Wine Shop Sangareddy District
x

Representational image

Highlights

సంగారెడ్డి జిల్లాలో దొంగలు వైన్‌షాపులను టార్గెట్‌ చేస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో జహీరాబాద్‌ పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో...

సంగారెడ్డి జిల్లాలో దొంగలు వైన్‌షాపులను టార్గెట్‌ చేస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో జహీరాబాద్‌ పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో నాలుగు వైన్‌షాపుల్లోదొంగలు పడ్డారు. తాజాగా న్యాల్‌కల్‌ దుర్గభవాని వైన్స్‌లోకి ఐదుగురు దొంగలు ప్రవేశించారు. గుర్తుపట్టకుండా ఉండేందుకు ముసుగులు ధరించారు. షెటర్‌ తొలగించి లోపలికి ప్రవేశించిన దొంగలు క్యాష్‌ కౌంటర్‌లో ఉన్న రెండు లక్షల నగదు ఎత్తుకెళ్లారు. దుండగులు చోరీకి పాల్పడిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.

ఆరుగురు దొంగలు మారుతి వ్యాన్‌లో వచ్చి వైన్స్‌ షట్టర్‌ తాళాలు తీసేసి క్యాష్‌ కౌంటర్‌ను ధ్వంసం చేసి నగదు అపహరించారు. చోరీ జరిగిందని తెలుసుకున్న వైన్స్‌ షాపు యజమాని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైన్‌ షాపులో చోరీ చేసింది తెలిసిన వ్యక్తులేనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరంతా ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories