ఆ కుటుంబానికి శాపంగా మారిన అంతుచిక్కని వ్యాధి

ఆ కుటుంబానికి శాపంగా మారిన అంతుచిక్కని వ్యాధి
x
Highlights

ఆ తల్లికి పిల్లలంటే అపారమై ప్రేమ కానీ పలుకరించకుండా చేసింది రాకాసి రోగం. ముద్దు మురిపాలను పిల్లలతో పంచుకోవాలని కోటి ఆశలను ఆవిరి చేసింది ఆ వ్యాది‌...

ఆ తల్లికి పిల్లలంటే అపారమై ప్రేమ కానీ పలుకరించకుండా చేసింది రాకాసి రోగం. ముద్దు మురిపాలను పిల్లలతో పంచుకోవాలని కోటి ఆశలను ఆవిరి చేసింది ఆ వ్యాది‌ కళ్లెదుటే ముద్దులోలికే పిల్లలున్నా కౌగౌలించుకోలేని దీనస్థితి ఆ మాతృమూర్తిది. చందమామ పేరు చెబుతూ గోరుముద్దలు కొసరి కొసరి పెట్టలేకపోతున్న దైన్యస్థితి ఆ అమ్మది. అంతుచిక్కలేని వ్యాధితో మంచం పట్టిన మహిళపై ప్రత్యేక కథనం.

మంచంపై కూర్చోని భర్త తినిపిస్తున్న అన్నం తింటున్న ఈ మహిళ కుటుంబం పరిస్థితి దయనీయం. కన్నబిడ్డలకు గోరుముద్దలు తినిపించాల్సిన ఆ తల్లి అనారోగ్యం భారీన పడి మంచానికే పరిమితం అయ్యింది. మోకాలి నొప్పితో మొదలైన రోగం శరీరంతటా వ్యాపించింది. ఇప్పుడు లక్ష్మీ ఎముకల గూడుగా మారింది.

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం చందారం గ్రామానికి చెందిన సారం భీమయ్య, లక్ష్మీ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో పెద్దకొడుకు విఘ్నేష్ తర్వాత ఇద్దరు కవలలు జన్మించారు. కవలపిల్లలకు రామ,లక్ష్మణ్ పేర్లు పెట్టారు. కొంతకాలానికి కవల పిల్లల్లో లక్ష్మణ్ మరణించాడు. మిగిలిన ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటున్న తరుణంలో లక్ష్మీ అనారోగ్యం భారిన పడింది. కడుపార కన్న పిల్లలను కంటి నిండా చూసుకోలేకపోతూ లోలోపల కుమిలిపోతుంది లక్ష్మీ.

భార్యకు వ్యాది నయం చేయించేదుకు భర్త భీమయ్య చేయని ప్రయత్నం లేదు. హైదరాబాద్ లోని నిమ్స్ సహా ఇతర పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో వైద్యం చేయించాడు. 20 లక్షలకు పైగా ఖర్చు చేశాడు.. ఉన్న ఎకరం భూమి అమ్ముకున్నాడు ఆస్తులు దారపోసిన ఫలితం లేక పోగా రోజు రోజుకు రోగం ముదురుతుందని భీమయ్య ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఓ వైపు మంచం పట్టిన భార్యకు సపర్యలు చేసుకుంటూనే పిల్లలను పోషించుకుంటున్నాడు. భార్య లక్ష్మీ వైద్యం కోసం దాతలు, సర్కార్ సహాయం చేయాలని భీమయ్య వేడుకుంటున్నాడు.తే




Show Full Article
Print Article
More On
Next Story
More Stories