YSRTP In Congress: కాంగ్రెస్‌ విలీనానికి ముహుర్తం ఫిక్స్..రేపు ప్రకటించే ఛాన్స్..?

The Time Has Come To Merge The YSRTP Into The Congress
x

YSRTP In Congress: కాంగ్రెస్‌ విలీనానికి ముహుర్తం ఫిక్స్..రేపు ప్రకటించే ఛాన్స్..?

Highlights

YSRTP In Congress: పాలేరు నుంచి శాసన సభకు పోటీ చేయాలనుకుంటున్న షర్మిల

YSRTP In Congress: వైఎస్సార్ టీపి విలీనం దిశగా అడుగులు వేస్తుందా...? అవుననే అంటున్నాయి వైఎస్సార్ టీపీ వర్గాలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్దంతి కావడంతో .ఇడుపుల పాయకు బయలు దేరిన వెళ్లారు వైఎస్సాటీపి అధ్యక్షురాలు ష‌ర్మిళ. ఈసందర్భంగా షర్మిల కీలక ప్రకటన చేయవచ్చని తెలంగాణ వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలతో వరుస చర్చలు జరుపుతున్న షర్మిళ .ఇప్పటి వరకు ఎలాంటి ప్రకకటన చేయలేదు. బుదవారం ఢిల్లిలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధితో భేటి అయ్యారు షర్మిళ. భేటి తరువాత ఢిల్లిలో ఎలాంటి ప్రకటన చేయని షర్మిల మరోసారి బిఆర్ఎస్ పార్టీ ఆరోపణలకు పరిమితమయ్యారు.

దాదాపు రెండు నెలలుగా కాంగ్రెస్ లో వైఎస్సార్ టీపిని విలీనం చేస్తారని ప్రచారం జరుగుతోంది. కర్నాటక లో కాంగ్రెస్ విజయం తరువాత వైఎస్సార్ టీపీ విలీనం పై చర్చ జరుగుతోంది. కర్నాటక డిప్యూటీ సిఎం డికే శివకుమార్ మధ్యవర్తిత్వంతో షర్మిళను కాంగ్రెస్ తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. షర్మిళ తెలంగాణ రాజకీయాల పై ఆసక్తి చూపుతున్నారు. అయితే, తెలంగాణ కాంగ్రెస్ లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణకు వస్తే అభ్యంతరం లేదని కొందరు చెబుతుంటే, ఆమేకు తెలంగాణతో సంబంధం ఏమిటని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు.

పార్టీ లాభపడడానికి ఎక్కడ జాయిన్ అయినా. పర్వాలేదంటున్నారు కొందరు. అయితే. బుదవారం సోనియాగాందీతో జరిగిన భేటిలో ఒక క్లారిటి వచ్చిందనే చర్చ వైఎస్సార్ టీపీలో సాగుతోంది. కర్నాటక నుంచి రాజ్యసభ సభ్యురాలిగా నామిటేన్ చేసి కాంగ్రెస్ అధిష్టానం షర్మిలతో పార్టీ పనిచేయించుకుంటుందని అంచాన వేస్తున్నారు. షర్మిళ మాత్రం.. పాలేరు నుంచి పోటి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అక్కడే తనకు సీటు కావాలని డిమాండ్ చేస్తున్నారట.

Show Full Article
Print Article
Next Story
More Stories