దమ్మాయిగూడలో చిన్నారి మృతి కేసులో వీడని సస్పెన్స్‌

* దర్యాప్తు కోసం 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు.. చిన్నారి మృతిపై వీడని మిస్టరీ

R Tripura Malini
Published on: 17 Dec 2022 8:59 AM IST
The Suspense In The Case Of  The Death Of  A Child In Dammaiguda Is Not Over
X

దమ్మాయిగూడలో చిన్నారి మృతి కేసులో వీడని సస్పెన్స్‌ 

Dammaiguda: దమ్మాయిగూడలోని చిన్నారి మృతి కేసులో సస్పెన్స్‌ ఇంకా వీడలేదు. కేసు దర్యాప్తు కోసం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందు తల్లిదండ్రుల మొబైల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైంటిఫిక్‌ ఎవిడెన్స్‌తో పాటు హ్యూమన్‌ ఇంటెలిజెన్స్‌తో కేసు విచారణ జరుపుతున్నారు. మరోవైపు కాసేపట్లో దమ్మాయిగూడలో ఇందు అంత్యక్రియలు జరగనున్నాయి. జవహర్‌నగర్‌ స్మశానవాటికలో చిన్నారి అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బాలిక కుటుంబసభ్యులను మంత్రి మల్లారెడ్డి పరామర్శించనున్నారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story