Telangana: తెలంగాణ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న మండల కమిటీల రగడ

The Struggle Of Mandal Committee Continues In Telangana Congress
x

Telangana: తెలంగాణ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న మండల కమిటీల రగడ

Highlights

Telangana: కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస రావును తొలగించాలని డిమాండ్‌

Telangana: తెలంగాణ కాంగ్రెస్‌లో మండల కమిటీల రగడ కొనసాగుతోంది. రోజుకో జిల్లా నుంచి నేతలు నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఇవాళ గాంధీభవన్‌ ముందు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఎల్లారెడ్డిలో సుభాష్ రెడ్డికి అనుకూలంగా ఉన్న వారికే..మండల కమిటీలో చోటు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వలేదని మదన్ మోహన్ వర్గీయులు గాంధీభవన్ ముందు బైఠాయించారు. పాత మండల కమిటీలను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కైలాష్‌ శ్రీనివాస రావును కూడా తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు జిల్లా నేతలు. శ్రీనివాస రావు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories