Station Ghanpur: MCIF సదస్సు.. ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ

The Station Was A Key Development In Ghanpur Politics
x

Station Ghanpur: MCIF సదస్సు.. ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ

Highlights

Station Ghanpur: ఇద్దరూ సదస్సులో కలవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ

Station Ghanpur: స్టేషన్ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య.. CWC మెంబర్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో వేదిక పంచుకున్నారు. దళితులకు రాజకీయ ప్రాధాన్యత అంశంపై MCIF ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా దామోదర రాజనర్సింహ హాజరయ్యారు. ఇదే సదస్సుకు తాటికొండ రాజయ్య కూడా హాజరయ్యారు. ఈ సందర్భంలో ఇద్దరు నేతలు ఒకే వేదిక మీద కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది.

దామోదర రాజనర్సింహ, రాజయ్య ఒకే వేదిక పంచుకోవడం.. స్టేషన్‌ ఘన్‌పూర్‌ రాజకీయాల్లో కీలక పరిణామం అనే చెప్పాలి. బీఆర్ఎస్‌ నుంచి ఘన్‌ఫూర్‌ టికెట్ ఆశించినా.. దక్కకపోవడంతో అసంతృప్తిలో ఉన్నారు రాజయ్య. అయినా కేసీఆర్ మీద తనకు నమ్మకం ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. లిస్టులో మార్పులు జరుగుతాయనే భావనతో.. టికెట్ వస్తుందనే ఆశతో ఉన్నారు రాజయ్య. ఉన్నట్టుండి రాజయ్య, దామోదర రాజనర్సింహతో భేటీ అయ్యారు. కొన్నాళ్లుగా టికెట్ రాలేదన్న అసంతృప్తితో రాజయ్య పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో దామోదర రాజనర్సింహను రాజయ్య కలవడం ఘన్‌పూర్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories