తందూరీ చాయ్..మజా వేరే భాయ్!

తందూరీ చాయ్..మజా వేరే భాయ్!
x
Highlights

* మెదక్ జిల్లా రామాయంపేటలో ఆకట్టుకుంటున్న తందూరి చాయ్ * కరోనా సమయంలో ఉద్యోగం పోగొట్టుకున్న ప్రశాంత్ * సొంతూరిలో తందూరి చాయ్ బండి నడుపుతున్న ప్రశాంత్ * ప్రశాంత్ టీ కొట్టుకు క్యూ కడుతున్న చాయ్ ప్రియులు

చాయ్ అనగానే ఎన్నో రకాలు మనకి గుర్తుకు వస్తాయి. చాయ్ అంటే ఇష్టపడని వారూ ఉండరు. రకరకాల చాయ్ టేస్ట్ చేయడం కొందరికి సరదా. అదేవిధంగా.. బతుకు బండి లాగడానికి కొందరికి చాయ్ ఆధారం అవుతోంది. పదిమందికీ నచ్చే చాయ్ ఇవ్వాలి.. ఆ వ్యాపారంతో నాలుగు మెతుకులు తినాలి అనుకునే వారు చాలా మంది చాయ్ వ్యాపారంతో బండి లాగిస్తుంటారు.

ఇక కరోనా మహమ్మారి ఎందరి ఉపాధినో నట్టేట ముంచేసింది. బాగా చదువుకుని, మంచి ఉద్యోగం చేస్తున్న వారు కరోనాతో అది కోల్పోయి వీధిన పడ్డారు. చాలా మంది ఈ పరిణామంతో కుదేలైపోయారు. కొందరు ఈ కష్టం నుంచి బయటకు పడటానికి ప్రయత్నాలు చేశారు. వారిలో ఒక యువకుని కథ ఇది. ఆ యువకుడు చేసి ఇస్తున్న చాయ్ ఇప్పుడు అక్కడి ప్రజలకు ఎంతో ఇష్టమైన చాయ్. మరి ఆ యువకుడెవరో.. ఆ చాయ్ కథేంటో ఇప్పుడు చూద్దాం..

ఆ యువకుడు కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయినా ఆందోళన చెందలేదు. వినూత్న ఆలోచనలకు పదును పెట్టాడు. తందూరి చికెన్, తందూరి రోటి మాదిరిగానే.. తందూరి చాయ్‌కి మంచి గిరాకి ఉంటుందని భావించి.. అటువైపు అడుగులు వేశాడు. మట్టి పాత్రలో తందూరి చాయ్ తయారు చేసి ఔరా అనిపిస్తున్నాడు ఓ యువకుడు. పర్యవరణ పరిరక్షణలో పాత్ర పోషిస్తున్న ఒక గ్రాడ్యుయేట్ తందూరి చాయ్ పై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ..

మెదక్ జిల్లా రామాయంపేటలో సిద్ధిపేట చౌరస్తాలో లక్ష్మినారాయణ హోటల్ తందూరి చాయ్ అందరిని ఆకర్షిస్తోంది. అక్కడ చాయ్ తాగేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రశాంత్ తయారు చేసిన ఈ చాయ్‌కు రోజు రోజుకు గిరాకీ పెరుగుతోంది. ప్రశాంత్ గతంలో హైదరాబాద్‌లో మల్టీమీడియాలో ఉద్యోగం చేసేవారు. అయితే.. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగం కోల్పోయాడు. ఉద్యోగం పోయినా ఆందోళన చెందలేదు ప్రశాంత్. తిరిగి గ్రామానికి వచ్చి వినూత్నంగా ఆలోచించాడు. దాంతో తందూరి చాయ్ హోటల్ పెట్టి కస్టమర్లను ఆకర్షిస్తున్నాడు. చాయ్ ప్రేమికులకు తన ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు.

కరోనా దెబ్బతో ఉద్యోగం కోల్పోయిన ప్రశాంత్ తరువాత ఏమిటి అని ఆలోచించాడు. వినూత్నంగా ఏదైనా చేయాలని భావించాడు. తందూరి చికెన్, తందూరి రోటి మాదిరిగానే తందూరి చాయ్ కూడా చేస్తే బాగుంటుందని ఆలోచన చేశాడు. మట్టికుండలను వేడి చేసి అందులో చాయ్ పోస్తారు.. ఆ తర్వాత కప్పులను పడేస్తారు. దీంతో మట్టి కప్పులు కావడంతో ఎలాంటి పర్యావరణ కాలుష్యం జరగదని చెప్తున్నారు. అంతేకాదు.. చాయ్ కూడా చాలా టెస్టీగా ఉంటుందంటున్నారు. ఈ టీ తాగడం వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధుల నుంచి బయటపడొచ్చని చెప్తున్నారు.

మట్టికుండల్లో తందూరి చాయ్ తాగి చాయ్ ప్రేమికులు మురిసిపోతున్నారు. దాంతో లాక్‌డౌన్‌తో ఉద్యోగం పోయిన ప్రశాంత్ కు సొంతూరిలో తందూరి చాయ్‌తో మరోరకంగా ఉపాధి దోరికిదంటూ మురిసిపోతున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories