Koppula Eshwar: తెలంగాణ పోలీసుల సేవలు అభినందనీయం

The Services Of Telangana Police Are Appreciated
x

Koppula Eshwar: తెలంగాణ పోలీసుల సేవలు అభినందనీయం

Highlights

Koppula Eshwar: జగిత్యాల జిల్లాలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు

Koppula Eshwar: తెలంగాణ పోలీసుల సేవలు అభినందనీయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. జగిత్యాల జిల్లాలో దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఓపెన్ హౌజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి మంత్రి కొప్పల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా, పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఫ్రెండ్లీ పోలిసింగ్ విధానం తెలంగాణ రాష్ట్రం నుంచే పుట్టిందని కొప్పులు ఈశ్వర్ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పటిష్టంగా అమలు అవుతున్నాయని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories