Medak: నేరస్థులకు శిక్ష పడేలా చూడటంలో కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర కీలకం: సిఐ చందర్

Medak: నేరస్థులకు శిక్ష పడేలా చూడటంలో కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర కీలకం: సిఐ చందర్
x
సిఐ చందర్
Highlights

ఒక నేరం నమోదైన తర్వాత అట్టి నేరానికి సంబందించిన పూర్తి వివరాలను అనగా ఎఫ్ఐఆర్, అరెస్ట్, రిమాండ్, చార్జిషీట్, ఎంబీడబ్ల్యూ, వారంట్లు రోజువారి .

మెదక్: ఒక నేరం నమోదైన తర్వాత అట్టి నేరానికి సంబందించిన పూర్తి వివరాలను అనగా ఎఫ్ఐఆర్, అరెస్ట్, రిమాండ్, చార్జిషీట్, ఎంబీడబ్ల్యూ, వారంట్లు రోజువారి కార్యక్రమాలు, పెండింగ్ లో ఉన్న కేసుల యొక్క వివరాలు, మొదలైన అంశాలపైన డి.సి.ఆర్.బి సి.ఐ చందర్ రాథోడ్ జిల్లాలోని అన్నీ పోలీసు స్టేషన్ ల కోర్ట్ కానిస్టేబుల్స్ కి, ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో అన్నీ పోలీసు స్టేషన్ ల కోర్ట్ కానిస్టేబుల్స్ కి, ఒకరోజు శిక్షణ కార్యక్రమం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.

ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా విచారణలో వున్న కేసుల యొక్క వివరాలను సీసీటీఎన్ఎస్ రా ఎలా నమోదు చేయాలో సూచించారు. అలాగే ఏదైనా ఈ సందర్భంగా డి.సి.ఆర్.బి సి.ఐ. చందర్ రాథోడ్ మాట్లాడుతూ... ఈ ట్రైనింగ్ లో బాగంగా ఎదైనా పట్టదగిన నేరము రిపోర్ట్ అయి, కేసును రిజిస్టర్ చేసిన తర్వాత దర్యాప్తు ప్రారంభిoచినప్పటి నుండి చార్జి షీట్ ఫైలు చేయునంత వరకు, కేసుకు సంబంధిoచిన ప్రతి అంశాన్ని ఎలా సీసీటీఎన్ఎస్ పొందుపరచాలనే విషయాలను, చట్టప్రకారంగా ఏవిధoగా చేయాలనే దానిపై అవగాహన నిర్వహించినారు.


పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న కోర్ట్ కానిస్టేబుల్, అధికారులు, తమ వీధిలో భాగంగా ఎప్పటికప్పుడు ఎన్.బి.డబ్లూ.(నాన్ బేలబుల్ వారెంటులను) క్రమం తప్పకుండా అమలుపరిచి, నేరస్తులకు శిక్షలు పడేవిధంగా కృషిచేయాలని, నేర రహిత సమాజాన్ని తీర్చిదిద్దాలంటే నిందితులకు కోర్టులో శిక్ష పడే విధంగా కోర్టు పోలీసు సిబ్బంది శ్రమించాలని, ఇందుకోసం ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటి నుండి కేసు పూర్తయ్యేంతవరకు నిందితుల యొక్క నేరాలను నిరూపించేందుకు అవసరమైన రుజువులు, పత్రాలు, సాక్షుల వాగ్మూలంను కోర్టుకు సమర్పించడంలో కోర్టు పోలీసు అధికారుల పనితీరులో వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో మెదక్ జిల్లా ఐ.టి.కోర్ ఇంచార్జ్ ఎస్సై ప్రభాకర్, ఐ.టి. కోర్ సిబ్బంది సయీద్ , అనిల్, మెదక్, తూప్రాన్ సబ్ డివిజన్ల కోర్ట్ కానిస్టేబుల్ లు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories