హైదరాబాద్ మీర్‌పేట్‌లో ప్రైవేట్ నర్స్ నిర్వాకం

X
Representational Image
Highlights
* వృద్ధ దంపతులకు కొవిడ్ వ్యాక్సిన్ అంటూ మత్తు మందు * 8 తులాల బంగారం చోరీ * మొదట పాయసంలో మత్తు మందు కలిపి ఇచ్చిన నర్స్
Sandeep Eggoju14 Feb 2021 8:04 AM GMT
హైదరాబాద్ మీర్‌పేట్‌లో దారుణం జరిగింది. కరోనా టీకా అని నమ్మించి వృద్ధ దంపతులకు మత్తు మందు ఇచ్చి చోరీకి పాల్పడింది నర్సు అనూష. మొదట వృద్ధ దంపతులకు పాయసంలో మత్తు మందు కలిపి ఇచ్చింది. అయితే వారికి షుగర్ ఉండటంతో పాయసాన్ని పారబోశారు. రెండోసారి కొవిడ్ వ్యాక్సిన్ అంటూ వృద్ధ దంపతులకు మత్తు మందు ఇచ్చింది. వృద్ధులు స్పృహ కోల్పోవడంతో 8 తులాల బంగారాన్ని చోరీ చేసిందా నర్సు. మీర్‌పేట పీఎస్ పరిధిలోని లలితనగర్‌లో నివాసం ఉంటున్న కస్తూరి, లక్ష్మణ్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఆఫీస్‌లో అకౌంటెట్‌గా రిటైర్డ్ అయ్యారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితురాలు అనూషను పోలీసులు అరెస్ట్ చేశారు.
Web TitleThe private nurse is trying to theft the gold in Meerpet
Next Story