ఈరోజు పీఆర్‌సీ నివేదిక విడుదల

The PRC report was released today
x

representational image

Highlights

* నేటి నుంచి ఉద్యోగ సంఘాలతో చర్చలు * టీఎన్జీవో, టీజీవోలకు ఆహ్వానం * 13 గుర్తింపు సంఘాలతో చర్చలు

ఇవాళ తెలంగాణ పీఆర్‌సీ నివేదిక విడుదల చేయనుంది. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు పీఆర్సీ కమిషన్ 7.5 శాతం లోపే ఫిట్‌మెంట్ సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. వేతన సవరణ సంఘం ఫిట్‌మెంట్‌ను 15శాతం కంటే తక్కువే సిఫార్సు చేసిన్నట్టుగా ఉద్యోగ సంఘాల్లో చర్చ జరుగుతోంది. సిఫార్సు చేసిన అంశాలను రాతపూర్వకంగా ఇవ్వనున్నారు. ఉద్యోగుల రిటైర్‌మెంట్ ఏజ్‌ను కూడా 60 ఏళ్లకు పెంచాలని కమిషన్‌‌కు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అదే విధంగా సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్‌ను ఇవ్వాలని రికమండ్ చేశారు.

ఇవాళ్టీ నుంచి 13 గుర్తింపు సంఘాలతో సీఎస్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ చర్చలు జరపనుంది. ఇందులో టీఎన్జీవో, టీజీవో, రెవెన్యూ సంఘాలు, పలు టీచర్ల సంఘాలు, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్, డ్రైవర్ల యూనియన్‌లున్నాయి. సంఘాలతో జరపనున్న చర్చల షెడ్యుల్‌ను ఇవాళ విడుదల చేయనున్నారు. పీఆర్‌సీ నివేదికపై ఉద్యోగుల్లో, వారి కుటుంబాల్లో ఉత్కంఠ నెలకొంది.

సీఎస్ సోమేష్ కుమార్ అధ్యక్షతన ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్ కుమార్‌లతో గల త్రిసభ్య కమిటీ బుధవారం నుంచి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది. తొలిరోజు టీఎన్జీవో, టీజీవో సంఘాలకు త్రిసభ్య కమిటీ ఆహ్వానం పంపింది. సాయంత్రం నుంచి బీఆర్‌కే భవన్‌లో చర్చలు జరుగుతాయి. రేపటి నుంచి రెండు నుంచి నాలుగు సంఘాలతో సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories