Moinabad Farmhouse: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొనసాగుతున్న విచారణ..!

Moinabad Farmhouse: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొనసాగుతున్న విచారణ..!
x
Highlights

* నేటితో ముగియనున్న నిందితుల కస్టడీ

Moinabad FarmHouse Case: దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులను పోలీసులు రెండోరోజు విచారించనున్నారు. నిన్న నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిని కస్టడీకి తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. చంచల్‎గూడ జైల్ నుంచి రాజేంద్రనగర్ పోలీస్‎స్టేషన్‎కు తరలించి ప్రశ్నలు సంధించారు. ప్రధాన నిందితుడు రామచంద్రభారతి కేంద్రంగానే కీలక విచారణ జరిగింది. ఢిల్లీ లింకులపైనా పలు కోణాల్లో పోలీసులు ప్రశ్నించారు.

మొయినాబాద్‎లోని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‎రెడ్డి ఫామ్‎హౌజ్‎లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాల కేసులో నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‎ను పోలీసులు విచారించారు. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సీపీ- సీవీ ఆనంద్ నేతృత్వంలో ఏర్పడిన సిట్ బృందంలోని సభ్యులు సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కల్మేష్వర్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‎రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ టీమ్ ఈ ముగ్గురు నిందితులను విచారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతి విచారణ కీలకంగా మారింది. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారల వీడియోల్లో ప్రముఖంగా వినిపించిన తుషార్‎తో రామచంద్రభారతికి సత్సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు. తుషార్ పాత్రపైనా పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

రామచంద్రభారతి, సింహయాజీలను నందకుమార్ తెరమీదకు తెచ్చినట్లు గుర్తించారు. ఈ ముగ్గురికి మైలార్‎దేవ్‎పల్లి లోని ఓ ఆశ్రమంలో పరిచయం జరిగింది. ఎమ్మెల్యేలతో సామ్రాజ్యయాగం చేయించాలని సింహయాజి భావించారు. దీనికి‌ గాను ఒక్కో యాగానికి 50 లక్షల రూపాయలకు పైగా సొమ్ము చేసుకొవాలని సింహయాజి భావించినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‎రెడ్డితో ఏర్పడిన పరిచయాలతో ఎమ్మెల్యేలను పార్టీ మారేలా ప్రలోభాలకు గురిచేసినట్లు తెలుస్తోంది. పూజల పేరుతో ఎమ్మెల్యేలకు దగ్గరై పార్టీ మారేలా ప్రలోభాలు చేయడం వీరి ప్రధాన ఆలోచనగా‌ పోలీసులు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రతీ డీల్‎ను తుషార్‎తో రామచంద్రభారతి చర్చించినట్లు పోలీసులు ఆధారాలు గుర్తించినట్లు సమాచారం. ఎమ్మెల్యేలను పార్టీ మారేలా చేయడంతో ఢిల్లీలో పలుకుబడి పెంచుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్‎తో ఢిల్లీలో పనులు చక్కబెట్టుకోవచ్చని రామచంద్రభారతి, నందు ప్లాన్‎గా భావించారని పోలీసులు గుర్తించారు. పార్టీ మారితే వందల కోట్లు ఇప్పించే బాధ్యత తమదేనని రామచంద్రభారతి, సింహయాజి మాట్లాడినట్లు వీడియో రికార్డింగ్స్‎ ఆధారంగా పోలీసుల విచారణ సాగింది. మొదటి రోజు కస్టడీలో తుషార్, రామచంద్రభారతి మధ్య సంబంధాలపై ఆధారాలను పోలీసులు గుర్తించారు. వీరి వెనుక ఉండి డీల్ నడిపింది ఏవరనేదానిపైనా పోలీసులు ఆరా తీశారు.

ఇప్పటికే ఈ కేసును విచారించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సైబరాబాద్ పోలీసులు, కర్ణాటక, తమిళనాడు, కేరళలకు ప్రత్యేక బృందాలు వెళ్లనున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‎ను సవాలు చేస్తూ బీజేపీ నేత ప్రేమేందర్‎రెడ్డి హైకోర్టు‎లో రిట్ అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు.సిట్ బృందంతో తమకు నమ్మకం లేదని, కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని పిటిషన్‎లో కోరారు. మొదటి రోజు కస్టడీలోసుదీర్ఘంగా విచారించిన పోలీసులు నిందితుల స్టేట్‎మెంట్ నమోదు చేసుకున్నారు.. కస్టడీ అనంతరం ముగ్గురు నిందితులను చంచల్‎గూడా జైలుకు తరలించారు. ఇవాళ రెండో రోజు విచారణలో భాగంగా మరోసారి నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకొని ప్రశ్నించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories