ఫాంహౌజ్ ఎపిసోడ్ లో తెరపైకి తిరుపతికి చెందిన సింహయాజులు పేరు

The name Of Simhayajulu from Tirupati came up in the farmhouse episode
x

ఫాంహౌజ్ ఎపిసోడ్ లో తెరపైకి తిరుపతికి చెందిన సింహయాజులు పేరు

Highlights

Farm House Episode: ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరుపుతూ పోలీసులకు పట్టుబడిన వారిలో తిరుపతికి చెందిన స్వామీజీ ఒకరు ఉన్నట్టు వెల్లడైంది.

Farm House Episode: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో ఎమ్మెల్యేల ఆపరేషన్ ఆకర్ష్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లతో పాటు పదవులు, కాంట్రాక్టులు ఆశజూపారని.. అడ్వాన్స్ డబ్బులతో మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్‌కు టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇంతకు వారెవరు? దీని వెనక ఎవరున్నారు.? టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రలోభపెట్టిందన్న ఆరోపణలు తెలంగాణే కాదు.. దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతరావు పార్టీ మారేందుకు సింహయాజులు, రామచంద్ర భారతి, నందకుమార్ అనే వ్యక్తులు ప్రలోభపెట్టారని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లతో పాటు పదవులు, కాంట్రాక్టులు ఆశజూపారని.. అడ్వాన్స్ డబ్బులతో మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్‌కు వచ్చారని చెబుతోంది. అందుకు సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేసింది. అయితే వీడియోల్లో ఎమ్మెల్యేలతో ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు? వారి బ్యాగ్రౌండ్ ఏంటి.?

ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరుపుతూ పోలీసులకు పట్టుబడిన వారిలో తిరుపతికి చెందిన స్వామీజీ ఒకరు ఉన్నట్టు వెల్లడైంది. ఎవరీ సింహయాజులు అంటూ పలువురు ఆసక్తిగా ఆరా తీశారు. సింహయాజులు అసలు పేరు అశోక్ స్వామి. స్వస్థలం అన్నమయ్య జిల్లా పడమటి కోనలోని అయ్యవారిపల్లి. పదేళ్ల క్రితమే ఆయన స్వగ్రామం విడిచి పెట్టి తిరుపతికి వెళ్లిపోయారు.

అన్నమయ్య జిల్లాలో శ్రీమంత్ర రాజపీఠం నిర్వహిస్తున్నారు. ఈయన ఎక్కువగా తిరుపతి, హైదరాబాద్‌లో ఉంటారు. రాయచోటి పట్టణంలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో తెలుగు టీచర్ గానూ, పీఆర్‌వోగానూ పనిచేసినట్టు సమాచారం. సుమారు 12 ఏళ్ల కిందట రాయచోటి నుంచి వెళ్లిపోయారని అక్కడ ఆయన గురించి తెలిసినవారు చెబుతున్నారు. ఏడాదిన్నర కిందట హైదరాబాద్ వచ్చి ఇక్కడే ఉంటున్నారని తెలుస్తోంది ఈ క్రమంలోనే బీజేపీ ముఖ్యులతో పరిచయాలు ఏర్పడినట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories