Nagarjuna Sagar: సాగర్ జలశయానికి రికార్డ్ స్థాయిలో నీటిమట్టం.. ప్రమాదంలో పలు గ్రామాలు..!

Nagarjuna Sagar
x

Nagarjuna Sagar

Highlights

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ జలాశయానికి రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.

Nagarjuna Sagar: నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయానికి రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండుకుండలా తలపిస్తుండడంతో అక్కడి ప్రాజెక్టు అన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ జలాశయానికి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుతం 588.90 అడుగులకు చేరింది. దీనితో సాగర్ డ్యామ్ అధికారులు అప్రమత్తమై సాగర్ 26 క్రస్టుగేట్లు 14 గేట్లు 10 అడుగులమేర,12 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి 5,00,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

2019 లోసాగర్జలాశయానికి 7,50,000 క్యూసెక్కుల గరిష్ట స్థాయిలో వరద నీరురాగ ,5సంవత్సరాల తరువాత ఇప్పుడు 2024 లో 5,00,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. గంట ,గంటకు వరద ఉదృక్తి పెరుగుతుండడంతో డ్యామ్ అధికారులు అడుగులు పెంచుతూ, సాగర్ జలాశయం నుండి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాంత రైతులను, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

సాగర్ దిగువ ప్రాంతంలోని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని రెవెన్యూశాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుంగా భద్రత చర్యలు చేపడుతూ స్థానిక అధికారులను 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీచేశారు. అప్రమత్తంగాఉండాలని తెలిపారు. ప్రజలకు ఏలాంటి ఇబ్బందిఉన్న 100కు సమాచారం ఇవ్వాలని జిల్లాఎస్పీ వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories