Komatireddy Raj Gopal Reddy: గొర్రెల పథకం కింద లబ్ధిదారులకు వేసిన డబ్బులను..

* కేసీఆర్ ప్రభుత్వం గొల్ల కురుమలను మోసం చేస్తోంది

R Tripura Malini
Updated on: 15 Nov 2022 2:59 PM IST
The money was given to the beneficiaries And taken back
X

గొర్రెల పథకం కింద లబ్ధిదారులకు వేసిన డబ్బులను

Komitireddy rajagopal Reddy: కేసీఆర్ ప్రభుత్వం గొల్లకురుమలను మోసం చేస్తోందని మునుగోడు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‎రెడ్డి ఆరోపించారు. గొర్రెల పథకం పేరుతో ఎన్నికల ముందు లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు జమచేసిన కేసీఆర్ ఎన్నికలు తర్వాత డబ్బులు వెనకకు తీసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ గొల్ల కురుమలతో కలిసి నిరసనలకు దిగారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అవసరానికి తగ్గట్లుగా హామీలివ్వడం మోసం చేయడం వారికి అలవాటేనన్నారు. ఇప్పటికైనా లబ్దిదారుల ఖాతాల్లో గొర్రెల పథకం డబ్బులు జమచేయకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story