Top
logo

Mini Medaram Jatara: నేటి నుండి మినీ మేడారం జాతర షురూ....

The Mini Madaram Fair starts from today
X

ఫైల్ ఇమేజ్


Highlights

మండమేలిగే పండుగ సందర్భంగా పూజారులు అమ్మవార్ల గద్దెల వద్ద నేటి నుంచి నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

Telangana: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పెరుగాంచిన సమ్మక్క-సారలమ్మ చిన్న జాతరకు వేళయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరిగే మినీ మేడారం జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేయడంతో పాటు నిధులను కూడా విడుదల చేసింది. మండమేలిగే పండుగ సందర్భంగా పూజారులు అమ్మవార్ల గద్దెల వద్ద ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇప్పటికే జాతరకు ఆలయ కమిటీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు నుంచి 27వ తేదీ వరకు ఈ జాతర జరగనుందని అధికారులు ప్రకటించారు. కాగా, మేడారం చిన్న జాతర తేదీలు ఖారురు కావడంతో అధికారులు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ జాతర కోసం అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేశారు. జాతరకు హాజరయ్యే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కోటి 52 లక్షల రూపాయలను విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య చెప్పారు. ఈ నిధులను వివిధ శాఖలకు కేటాయించి జాతరకు హాజరయ్యే భక్తులకు మెరుగైన వసతులు కల్పించనున్నారు.

అసలైన సమ్మక్క సారలమ్మ జాతర 2 సంవత్సరాల ఒకసారి జరుగుతుంది. జాతరకు 20 లక్షలకుపైగా భక్తులు వస్తారని అంచనా. గద్దెల ప్రాంగణంలో చలువ పందిళ్లు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. స్నానాలకు జంపన్నవాగులో వాటర్‌ ట్యాప్‌లను అమర్చారు. మహిళల కోసం దుస్తులు మార్చుకునే గదులు కూడా అందుబాటులోకి తెచ్చారు. తాగునీటి కోసం మిషన్‌ భగీరథ కింద పది మినీవాటర్‌ ట్యాంకులను ఏర్పాటు చేశారు. వరంగల్‌, హన్మకొండ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు లను నడిపిస్తోంది.

Web TitleThe Mini Medaram Fair starts today
Next Story