T Congress: టీ కాంగ్రెస్‌లో యూనిటీ కొనసాగేనా..?

నిన్న జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేతల ఐక్యతారాగం
x

T Congress: టీ కాంగ్రెస్‌లో యూనిటీ కొనసాగేనా..?

Highlights

T Congress: నిన్న జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేతల ఐక్యతారాగం

T Congress: టీ కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు సర్వసాధారణం. చిన్న చిన్న విషయాలకే నేతలు కలహించుకుంటారు. ఒకరు సమావేశానికి వస్తే మరోకరు డుమ్మా కొడుతారు. ఒకరి ప్రతిపాదనలను మరొకరు వ్యతిరేకిస్తారు. పార్టీ అంతర్గత వేదికలపై చర్చించాల్సిన అంశాలను బాహాటంగానే బయటపెడతారు. రేవంత్ రెడ్డి TPCC చీఫ్ అయ్యాక ఇది మరింత ఎక్కువైంది. చాల మంది సీనియర్లు రేవంత్ ప్రతిపాదనలను వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నారు. మునుగోడు అభ్యర్ధి ఎంపిక మొదలుకుని.. రేవంత్ వ్యాఖ్యల దాకా అన్ని వివాదస్పదమయ్యాయి. దీంతో సీనియర్ల మీటింగ్ ను నిర్వహించేందుకే ఢిల్లీ దూతలు రావాల్సి వస్తుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ప్రతి వారం హైదరాబాద్ వస్తున్నారు. దీంతో కుమ్ములాటలే కాంగ్రెస్ కొంప ముంచుతాయని.. కనీసం మీటింగ్ లు పెట్టుకునే పరిస్థితి పార్టీలో లేదని కార్యకర్తలు వాపోయేవారు.

అలాంటి సమయంలో అందరిని ఆశ్చర్యపరుస్తూ నాంపల్లిలో పార్టీ విస్త్రతస్థాయి సమావేశం ప్రశాంతంగా సాగింది. కొత్తగా PCC డెలిగేట్ల ఎంపిక అంటే గతంలో తలప్రాణం తొకకొచ్చేది. మా పేరు లేదని నేతలు గొడవలకు దిగేవారు. కాని ఈ దఫా మరో వంద మందికి అదనంగా PCC ప్రతినిధులుగా అవకాశం కల్పించి అందరిని సంతృప్తి పరిచారు. TPCC చీఫ్ రేవంత్ నెర్పుతో వ్యవహరించడం వల్లే ఏలాంటి రభస లేకుండా విస్త్రతస్థాయి సమావేశం సజావుగా సాగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

పార్టీ నేతలకు క్యాడర్ కు గట్టి సంకేతం పంపేందుకు ముందు రోజే కొచ్చిలో భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధితో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు రేవంత్. ఇక పాదయాత్రలో రాహుల్ తో పలు అంశాలపై చర్చలు చేశారు. దీంతో రాహుల్ గాంధీ అమోదంతోనే అంతా జరుగుతుందున్న సంకేతాలు పార్టీ శ్రేణుల్లోకి వెళ్లాయి. దీంతో అనుకున్న ప్లాన్ ప్రకారం అంతా సవ్యంగా సాగింది. ఈ సమావేశంలో రెండు తీర్మాణాలను ఏక గ్రీవంగా ఆమోదించారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధిని.. జాతీయ అధ్యక్ష పదవి చేపట్టాలని TPCC ఏకగ్రీవ తీర్మానాం చేసింది. ఇక PCC కార్యవర్గ సభ్యులు, AICC సభ్యులు, TPCC చీఫ్ ఎంపిక బాధ్యతను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధికి అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసారు. అదే సమయంలో పార్టీలోని వైరి వర్గాలు మొత్తం కలిసి పనిచేసాయి. సీనియర్లు ఒకరు ప్రతిపాదిస్తే.. మరో వర్గం బలపరిచి ఐక్యత ప్రదర్శించారు. అందుకే రెండు తీర్మాణాలు ఏకగ్రీవంగా అమోదించేసారు.

Show Full Article
Print Article
Next Story
More Stories