నేటి నుంచి గ్రూప్‌-1 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

The Group‌-1 Application Process Starts Today
x

నేటి నుంచి గ్రూప్‌-1 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

Highlights

Telangana: గ్రూప్‌-1 పోస్టులకు మే 31 వరకు దరఖాస్తుల స్వీకరణ

Telangana: కొలువుల జాతర మొదలు కానుంది. గ్రూప్‌-1 కొలువుల భర్తీలో భాగంగా నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. గ్రూప్‌-1 పోస్టులకు మే 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించేందుకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల లింకులు అందుబాటులోకి రానున్నాయి.

అయితే గ్రూప్‌-1కు దరఖాస్తు చేసుకోవాలంటే OTRలో సవరణ చేసుకోవాలి లేదా కొత్తగా OTR నమోదు చేసుకోవల్సి ఉంటుంది. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం OTRలో సవరణ చేసుకున్న వారే అర్హులవుతారు. మొత్తం 18 శాఖల్లోని 503 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రక్రియ అంతా సజావుగా సాగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. నిన్నటి వరకు మొత్తం 2లక్షల 12వేల 7వందల 84 మంది అభ్యర్థులు OTRలో తమ వివరాలను నమోదు చేసుకున్నట్లు అధికారులు చెప్పారు.


Show Full Article
Print Article
Next Story
More Stories