రోడ్డు ప్రమాదాలు తగ్గించి మరణాల రేటు నివారించడమే లక్ష్యం

రోడ్డు ప్రమాదాలు తగ్గించి మరణాల రేటు నివారించడమే లక్ష్యం
x
Highlights

రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి మరణాల రేటును నివారించడమే లక్ష్యంగా జనవరి మాసంలో జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.

హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి మరణాల రేటును నివారించడమే లక్ష్యంగా జనవరి మాసంలో జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు లో తీసుకోవాల్సిన కార్యాచరణపై సచివాలయంలో సిఎస్ కె.రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తిలతో కలసి రవాణా శాఖ మంత్రి జిల్లా కలెక్టర్ లతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

గత సంవత్సరం తెలంగాణ లో 25,934 రోడ్డు ప్రమాదాలు జరగగా, 7,949 మంది మరణించారని మంత్రి తెలిపారు. ప్రమాదాలకు ప్రధాన కారణం రోడ్డు నిబంధనలు ఉల్లంఘించి రాష్ డ్రైవింగ్, డ్రైవర్ నిరక్ష్యమేనని గుర్తించామన్నారు. ప్రమాదాలను నివారించడానికి రోడ్డు నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ రోడ్డు నిబంధనలపై ప్రజలకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల పై అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం సూచించారు. రోడ్డు సేఫ్టీ పై ప్రతి జిల్లాలో ఏర్పడిన రోడ్ సేఫ్టీ కమిటీ లు ఈ నెలాఖరులోపు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ లకు సూచించారు. దీనిలో జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఆర్ అండ్ బి అధికారి కన్వీనర్ గా ఉంటారు. ఇందులో రవాణా శాఖ , ఆర్టీసీ , విద్యా శాఖ అధికారులు , పోలీస్ , ట్రాఫిక్ , ఇతర విభాగాల అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.

ప్రతి జిల్లాలో రోడ్ భద్రతా ఫోర్స్ వాలంటీర్ బృందాలను ఏర్పాటు చేసి అన్ని గ్రామాల్లో, పాఠశాలల్లో అధికారులతో కలిసి ఈ టీం అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. ఈ బృందాలను జనవరి 26న ప్రశంస పత్రాలతో సత్కరిస్తారు. పాఠశాలల్లో రోడ్డు నిబంధనలపై పిల్లలకు అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేస్తున్న చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్ లు చొరవ తీసుకోవాలని సూచించారు. యూనిసెఫ్ సహకారంతో విద్యార్థులకు ట్రాఫిక్ అవేర్నెస్ పై పాఠ్యాంశాలు చేర్చడం జరుగుతుందని తెలిపారు. కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకునేవారికి, డ్రైవింగ్ లైసెన్స్ పొందిన ప్రతివారికి రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించడం జరుగుతుంది. స్క్రాపింగ్ పాలసీ ద్వారా ఫిట్నెస్ లేని వాహనాలను తొలగించడం జరుగుతుందన్నారు.

సమీక్షా సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, జిల్లా కలెక్టర్ లు , అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఎంజేపి సెక్రటరీ సైదులు, నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు, వివిధ సంక్షేమ శాఖ అధికారులు, రవాణా శాఖ అధికారులు, పోలీస్, ట్రాఫిక్, ఆర్ అండ్ బి, విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories