Bathukamma: తంగేడు....కనుమరుగవుతోందా?

Bathukamma: తంగేడు....కనుమరుగవుతోందా?
x

 Bathukamma: తంగేడు....కనుమరుగవుతోందా?

Highlights

బతుకమ్మ పండుగలో తంగేడు పువ్వుకు విశిష్టస్థానం క్రమంగా కనుమరుగవుతున్న తంగేడు పువ్వు తెలంగాణ అస్థిత్వంలో తనకంటూ ఓ పేజీ తంగేడు భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న శాస్త్రవేత్తలు

తంగేడు పువ్వు ప్రస్తావన లేని బతుకమ్మ పాట ఉండదు... తంగేడు పువ్వు లేనిదే బతుకమ్మ పండగా పూర్తవదు..తెలంగాణ అస్దిత్వంలో తనకంటూ ఓ పేజీని నింపుకున్న తంగేడు పువ్వు ఇప్పుడు కనుమరుగు అవుతోంది...అడవి తంగేడు భవిష్యత్ తరాలకు ఏఐ చిత్రంగా మారబోతుందా.. ఒకప్పుడు విరివిగా లభించే తంగేడు పువ్వు.. ఇప్పుడు క్రమంగా కనిపించడమే మానేసింది.. ఎక్కడో ఓ చోట కనిపిస్తున్న తంగేడుకు భవిష్యత్తు ఉంటుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.


తెలంగాణ అంటేనే బతుకమ్మ...బతుకమ్మ అంటేనే తెలంగాణ...ఇలా చెప్పుకునేంతాల బతుకమ్మ పండగా తెలంగాణలో ఇమిడిపోయింది..అలాంటి బతుకమ్మ తయారీలో అడవి తంగేడు తప్పని సరి...తెలంగాణ ప్రజలు బతుకమ్మ పండగ వస్తోందంటే చేతిలో సంచి పట్టుకుని తంగేడు,గునుగు పూల కోసం అటవి బాట పట్టేవారు...కావాల్సినన్ని పువ్వులు తీసుకొచ్చి ఇష్టంగా బతుకమ్మ ఆటలు ఆడేవారు..ఇంతలా తెలంగాణ గ్రామల్లో ఇమిడిపోయింది కాబట్టే అడవి తంగేడు పువ్వుని తెలంగాణ రాష్ట్ర పుష్పంగా ప్రకటించి ప్రభుత్వం..అంతటి ప్రాముఖ్యం కలిగిన అడవి తంగేడు పూర్తిగా కనుమరుగైపోయింది...అడవి తంగేడు స్దానంలో ఇప్పుడు హైబ్రీడ్ విత్తన ఉత్పత్తితో ఉద్బవించిన సింగి తంగేడు రాజ్యమేలుతోంది...దీంతో తెలంగాణ అస్దిత్వ చిహ్నాంగా భావించే అడవి తంగేడు భవిష్యత్ తరాలకు కేవలం ఒక చరిత్రలా మిగిలే ప్రమాదం పొంచి ఉంది..


నిజానికి అడవి తంగేడు తెలంగాణ పండుగలో వాడే ఓ పుష్పం మాత్రమే కాదు...దక్కన్ పీఠభూమిగా పిలవబడే తెలంగాణ ప్రాంత వాతావరణ పరిస్దితికి కూడా ఓ నిలువుటద్దం...తెలంగాణలో ఎంతటి వర్షాబావ పరిస్దితులు ఉన్నప్పటికీ తంగేడు పూసేది..అత్యంత తక్కువ నీటితో జీవించే మొక్క తంగేడు...బీడుభూముల్లోనూ విరివిగా పూసేవి...కానీ ఇప్పుడు గ్లోబలేషన్ పెరిగి అంతటా కాంక్రీట్ జంగిల్ గా మారిపోయింది..గ్రామాల్లోనూ తంగేడుని తుడిచిపెట్టేస్తున్నారు..నిజానికి తెలంగాణలో పూర్వీకులు ఔషదంగా కూడా తంగేడుని వాడేవారు..చర్మ సంబందిత వ్యాదులకు తంగేడు మొక్కు అద్బుత ఔషద మొక్కగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు...అసలు ఇప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో ఇళ్లముందు కనిపిస్తున్న పొడవైన సింగి తంగేడు మొక్కలు అసలు తంగేడు కాదంటున్నారు.


ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల అడవులు పూర్తిగా అంతరించిపోయాయి..కరీంనగర్ చుట్టూ ఉండే గుట్టలు ఇఫ్పుడు గ్రానైట్ క్వారీలు, క్రషర్ల పుణ్యమా అని అంతరించిపోతున్నాయి...బతుకమ్మ పండగ వచ్చిదంటే గుట్టపైకి వెళ్లి తంగేడు తెచ్చిన రోజులు గుర్తు తెచ్చుకుని స్దానికులు ఉద్వేగపడుతున్నారు. నేటి తరానికి కనీసం అడవి తంగేడుని చూపించలేకపోతున్నామని వాపోతున్నారు.ఇక భవిష్యత్ లో కేవలం ఇంటర్నెట్ లోనే అడవి తంగేడు చూపించాల్సి వస్తుందని వాపోతున్నారు.. హారితాహారంలో బాగంగా సింగి తంగేడుని ఇంటింటికి పంచిన ప్రభుత్వం..అడవి తంగేడుని ఎందుకు విస్మరిస్తున్నదే అసలు ప్రశ్న...


ఇలా తంగేడుతో పాటు.. ఔషధ మూలికలున్న ఎన్నో అంతరించిపోతుండటంపై శాతవాహన యూనివర్సిటీ అధ్యాపకుల బృందం 2013 నుంచే పరిశోధన కొనసాగిస్తున్నారు. తంగెడులో యాంటీ HIV,యాంటీ వైరల్ ప్రాపర్టీస్ కూడా అధికంగా ఉన్న నేపథ్యంలో... ఓవైపు సాంస్కృతికంగా, మరోవైపు ఔషధపరంగా కూడా అత్యంత కీలకమైన మొక్క అంతరించిపోవడం అందోళనకరంగా మారింది..ఇంకోవైపు మల్లన్న పట్నాల వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వాడే రంగులుగా ఉపయోగపడే తంగేడును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న వాదన వినిపిస్తోంది. లేకపోతే భవిష్యత్ తరాలకు తంగెడు ఓ చరిత్రగా మాత్రమే చెప్పుకునే ప్రమాదముందన్న ఆందోళన రేకెత్తుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories