ఆ ఫ్యాన్సీ నెంబర్ కోసం ఎంత పెట్టారో తెలుసా? ఓ చిన్న కారు కొనుక్కోవచ్చు!

Car register number auction
x

Representational Image

Highlights

ఒక చిన్న కారు కొనగలిగే మొత్తాన్ని తమ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం ఖర్చు పెట్టారు సంగారెడ్డి జిల్లలో

కార్లు కొనుక్కోవడం ఎంత సరదానో దానికి తమకు నచ్చిన నెంబర్ వచ్చేలా చూసుకోవడమూ అంతే సరదా కొందరికి. కొంతమంది జాతకరీత్యా కావలసిన నెంబర్ కోసం ప్రయత్నిస్తారు. కొంతమందికి నెంబర్ సెంటిమెంట్ ఉంటుంది. ఇలా రకరకాల కారణాలతో కావలసిన నెంబర్ కోసం చాల మంది ప్రయత్నిస్తారు.

ముఖ్యంగా సినీతారలు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు తమకు కావలసిన నెంబర్ కోసం మోజుతో ప్రయత్నిస్తారు. రవాణా శాఖ ఇటువంటి ఫ్యాన్సీ నెంబర్లను వేలంపాటలో ఉంచుతుంది. ప్రతి సిరీస్ లోనూ ఇలా ఫ్యాన్సీ నెంబర్లు వేలంలో ఉంచుతారు. వాటికోసం చాలా మంది పోటీ పడి సొమ్ము వెచ్చిస్తారు.

తాజాగా సంగారెడ్డి జిల్ల్లాలో 9999 ఫ్యాన్సీ నెంబర్ వేలంపాటలో రికార్డు ధర పలికింది. గురువారం సంగారెడ్డి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో TS 15FB 9999 నెంబర్ ను వినియోగదారుల కోసం వేలంపాటలో ఉంచారు. ఈ నెంబర్ కోసం నలుగురు పోటీ పడ్డారు, వీరిలో పటాన్ చెరు మండలం పాశమైలారం లోని న్యూ టెక్నాలజీస్ సంస్థ ప్రతినిధులు 4,01,000 రూపాయలకు ఈ నెంబర్ దక్కించుకున్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లా ఉప రవాణా కమిషనర్ సీహెచ్ శివలింగయ్య ఈ విషయాన్ని తెలిపారు. సంగారెడ్డి జిల్లలో ఇప్పటివరకూ ఓ నెంబర్ కు వచ్చిన అత్యధిక ధర ఇదే అని అయన చెప్పారు. ఇప్పటివరకూ 3 లక్షల 50 వేల రూపాయలు ఓ నెంబర్ కు వచ్చింది. ఇప్పుడు ఈ రికార్డును తాజా నెంబర్ చెరిపేసింది.

ఇక ఇక్కడే కొత్త సిరీస్ లోని TS 15FE 0001 నెంబర్ కోసం ఎవరూ పోటీకి రాకపోవడంతో దానిని ప్రాధమిక ధర 50 వేల రూపాయలకు కేటాయించనున్నట్టు ఆయన చెప్పారు. ఎవరికైనా ఆసక్తి ఉంటె దీనిని స్వంతం చేసుకోవచ్చన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories