Congress: కాంగ్రెస్‌తో కామ్రేడ్స్..? చర్చలు సఫలమయ్యాయని..

The Decision Of The Left To Work With The Congress
x

Congress: కాంగ్రెస్‌తో కామ్రేడ్స్..? చర్చలు సఫలమయ్యాయని..

Highlights

Congress: పొత్తుల వ్యవహారం జాతీయ పార్టీ నేతలే చూస్తున్నారన్న కామ్రేడ్లు

Congress: కాంగ్రెస్‌తో కలిసి పని చేసేందుకు వామపక్షాలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ను సీపీఐ నేత నారాయణ కలిశారు. పొత్తు, సీట్లపై చర్చించిన కేసీ, నారాయణ చర్చలు సఫలమయ్యాయని.. కాంగ్రెస్‌తో కలిసి వెళ్తామని నారాయణ చెప్పినట్లు సమాచారం. సీపీఐ, సీపీఎం పార్టీలు సమావేశమై చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో సీపీఎం నేతలతో జాతీయ కాంగ్రెస్ నేతల చర్చలు కొనసాగుతున్నాయి. గెలవగలగే స్థానాల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు... చెరో రెండు సీట్లు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం. అయితే చెరో 4 సీట్ల కోసం కమ్యూనిస్టులు పట్టు పడుతున్నారు. చెరో రెండు సీట్లతో పొత్తు ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories