జోగులాంబ గద్వాలలో మూడుకు చేరిన మృతుల సంఖ్య

The Death Toll in Jogulamba Gadwal Has Reached Three
x

జోగులాంబ గద్వాలలో మూడుకు చేరిన మృతుల సంఖ్య

Highlights

Gadwal: కలుషిత నీరు త్రాగి గద్వాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో మహిళ మృతి

Gadwal: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కలుషిత నీటితో 24 మంది ఆసుపత్రి పాలైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకిచ్చింది. గంటగేరి, వేదనగర్ కాలనీకి చెందిన ప్రజలు కలుషితనీటి వల్లే సమస్య తలెత్తిందని డాక్టర్స్ నిర్ధారణ చేయగా కుటుంబ సభ్యులు డాక్టర్స్, ఆశ కార్యకర్తల పై ఆగ్రహం వ్యక్తం చేసారు. కాలనీలో మూడు రోజాలు నుండి సమస్య ఉండగా ఒక్కరోజు ఇటు వైపు చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆశ కార్యకర్తలు మైక్ లో కలుషితనీటిని త్రాగొద్దని, వీరేచనలు, వాంతులు చేసుకొంటే వెంటనే ఆసుపత్రిలో చేరాలని అనౌన్స్ చేశారు.గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స అందిస్తుండగా మున్నరు కృష్ణ (48) నర్సింగమ్మ (55) సీరియస్ కావడంతో సూపరేండెంట్ స్వంత ఆసుపత్రిలో చికిత్స కోసం తరలించగా అక్కడ శృతి మించడంతో కర్నూల్ కు తరలించాగా అక్కడే మృతి చెందారు. డాక్టర్స్ వైపల్యంతో ఈ సంఘటన చోటు చేసుకోవడం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories