Peddapally: చిన్నారి కొడుకును బావిలో పడేసి... తండ్రి ఆత్మహత్యాయత్నం

The Child Son was Thrown into the well the Father Attempted Suicide
x

Peddapally: చిన్నారి కొడుకును బావిలో పడేసి... తండ్రి ఆత్మహత్యాయత్నం

Highlights

Peddapally: పసిబిడ్డ మృత్యువాత, చావుబతుకులమధ్య తండ్రి ఆస్పత్రి పాలు

Peddapally: తన కొడుకును వ్యవసాయ బావిలో పడేసి ఓ తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రావులపల్లి గ్రామానికి చెందిన కల్వల తిరుపతిరెడ్డి తన 17 నెలల కుమారుడు నివాన్ష్ బావిలో పడవేసి, తాను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు తిరుపతి రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన చికత్స కోసం కరీంనగర్ కు తరలించారు.

సంఘటన స్థానిక చేరుకున్న పోలీసులు బావిలో బాలుడి కోసం గాలించగా నివాన్ష్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు భార్య మానస పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.తన కుటుంబ సభ్యుల భూ తగాదాల వల్ల తిరుపతి రెడ్డి గత కొన్ని రోజులుగా మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారని కుటుంబ సభ్యులు,పోలీసులు తెలిపారు. చిన్నారి బాలుడు మృతి తో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories