మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌పై సీఎం రేవంత్‌ సమీక్ష

The Chief Minister held a review meeting on Musi River Development Corporation
x

మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌పై సీఎం రేవంత్‌ సమీక్ష

Highlights

Revanth Reddy: అవసరమైన ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయాలి

Revanth Reddy: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌ మహానగరంలో మూసీ నది ప్రారంభమయ్యే ప్రాంతం నుంచి చివరి వరకు మూసీ నది పరివాహక ప్రాంతం మొత్తాన్ని ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దాలన్నారు. మూసీ నది వెంట బ్రిడ్జిలు, కమర్షియల్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, వాకర్‌ జోన్‌లు, పాత్‌-వేలను ప్రభుత్వ, ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ విధానంలో నిర్మించే విధంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలన్నారు.

మూసీ నదిలో కాలుష్యాన్ని తగ్గించి, మురుగు నీరు ప్రవహించకుండా అవసరమైన ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు. మూసీలో శుద్ధి చేసిన నీరు ప్రవహించేందుకు చర్యలు చేపట్టడంతో పాటు.. తగు నీటిమట్టం ఉండేలా చెక్‌ డ్యామ్‌లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇక.. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories