KTR: కాదు అని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా..

The Centeral Is Getting Rich With Telangana Money
x

KTR: తెలంగాణ సొమ్ముతో కేంద్రం కులుకుతోంది 

Highlights

KTR: కిషన్‌రెడ్డి, టీబీజేపీ ఎంపీలకు కేటీఆర్ సవాల్

KTR: దేశంలో ఉన్న మరో రెండు జాతీయ పార్టీలు జూటా మాటలు చెబుతున్నాయని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 8 ఏళ్లలో 3లక్షల68 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ నుంచి పన్నులు కట్టామని.. కానీ రాష్ట్రానికి తిరిగి వచ్చింది కేవలం 1లక్షా 68 వేల కోట్లు మాత్రమే అని తెలిపారు. ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారో తెలంగాణ ప్రజలు గమనించాలని కిషన్‎రెడ్డి కామెంట్స్‎పై ఫైరయ్యారు కేటీఆర్. తాను చెప్పింది తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. లేదంటే కేంద్ర మంత్రి కిషన్‎రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. హుజూర్‌నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ బీజేపీపై విరుచుకుపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories