TS BJP: బీజేఎల్పీ నేత ఎంపికపై బీజేపీ నాయకత్వం కసరత్తు.. రేసులో రాజాసింగ్

The BJP Leadership Is Working On The Selection Of The BJLP Leader
x

BJP: బీజేఎల్పీ నేత ఎంపికపై బీజేపీ నాయకత్వం కసరత్తు.. రేసులో రాజాసింగ్

Highlights

TS BJP: ఒకటి రెండు రోజుల్లో ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేయనున్న బీజేపీ

TS BJP: శాసనసభా పక్ష నేత ఎంపికపై బీజేపీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. అసెంబ్లీలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. రేసులో రాజాసింగ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి ఉన్నారు. గోషామహల్ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్.. గత శాసనసభలో బీజేఎల్పీ నేతగా రాజాసింగ్‌కు అనుభవం ఉంది. నిర్మల్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి గెలవడంతో ఆయన పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.

ఇక అనూహ్యంగా రేసులోకి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వచ్చారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిపై విజయం సాధించిన వెంకటరమణారెడ్డికి కూడా బీజేఎల్పీ నేతగా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేయనున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం.. బీజేఎల్పీ నేతను ఎంపిక చేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories