TGSRTC Jobs: TGSRTCలో ఉద్యోగాలు.. 198 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

TGSRTC Jobs
x

TGSRTC Jobs: TGSRTCలో ఉద్యోగాలు.. 198 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Highlights

TGSRTC Jobs: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది.

TGSRTC Jobs: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఖాళీగా ఉన్న కీలక పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు (TSLPRB) గురువారం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 198 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రెయినీ – 84 పోస్టులు, మెకానికల్ సూపర్వైజర్ ట్రెయినీ – 114 పోస్టులు ఉన్నాయి.

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.27,080 నుంచి రూ.81,400 వరకు వేతనం అందించనున్నారు. అదనంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.

దరఖాస్తు వివరాలు

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ 2025 డిసెంబర్ 30 ఉదయం 8 గంటల నుంచి 2026 జనవరి 20 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు సమర్పించవచ్చు.

అర్హతలు

ట్రాఫిక్ సూపర్వైజర్ పోస్టులకు — ఏదైనా డిగ్రీ

మెకానికల్ సూపర్వైజర్ పోస్టులకు — సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ తప్పనిసరి

వయోపరిమితి, రిజర్వేషన్లు, ఇతర నిబంధనలను అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్‌లో పరిశీలించాలని బోర్డు సూచించింది.

ఎంపిక విధానం

మెరిట్ ఆధారంగా ఎంపిక జరగనుంది. పరీక్ష విధానం, సిలబస్, ఫిజికల్ టెస్టుల వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో పొందుపరిచారు.

చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు తలెత్తకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఈ సూపర్వైజర్ పోస్టులు కీలక పాత్ర పోషించనున్నాయని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories