TG TET 2026: తెలంగాణ టెట్ 2026 హాల్‌టికెట్లు విడుదల

TG TET 2026
x

TG TET 2026: తెలంగాణ టెట్ 2026 హాల్‌టికెట్లు విడుదల

Highlights

TG TET 2026: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET 2026) హాల్‌టికెట్లు విడుదలయ్యాయి.

TG TET 2026: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET 2026) హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో వెబ్‌సైట్‌లోకి ప్రవేశించి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పరీక్ష తేదీలు & సమయాలు

టెట్ 2026 ఆన్‌లైన్ రాత పరీక్షలు జనవరి 3, 4, 5, 6, 8, 9, 11, 19, 20 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్లుగా పరీక్షలు జరుగుతాయి.

మొదటి సెషన్ : ఉదయం 9.00 నుంచి 11.30 వరకు

♦ రెండో సెషన్ : మధ్యాహ్నం 2.00 నుంచి 4.30 వరకు

♦ పరీక్ష వ్యవధి : 2 గంటలు 30 నిమిషాలు

షెడ్యూల్ వివరాలు

జిల్లా వారీగా ఏ తేదీన ఏ జిల్లాకు ఏ పేపర్ పరీక్ష ఉంటుందో తెలిపే షెడ్యూల్‌ను ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అభ్యర్థులు తమ పరీక్ష తేదీ, సమయం, కేంద్ర వివరాలను హాల్ టికెట్ ద్వారా తెలుసుకోవాలని విద్యాశాఖ సూచించింది.

దరఖాస్తుల వివరాలు

ఈసారి పేపర్–1, పేపర్–2 కలిపి మొత్తం 2.37 లక్షల మంది అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఈసారి టెట్‌కు దరఖాస్తు చేయడంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది.

కేజీబీవీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లతో కలిపి సుమారు 70 వేల మంది ఉపాధ్యాయులు టెట్‌కు అప్లై చేసినట్టు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.

ఫలితాల తేదీ

టెట్ పరీక్షల అనంతరం ఫిబ్రవరి 10 నుంచి 16 మధ్యలో ఫలితాలను ప్రకటించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories