తెలంగాణ ఇంటర్ విద్యార్ధుల్లో టెన్షన్‌ టెన్షన్‌

తెలంగాణ ఇంటర్ విద్యార్ధుల్లో టెన్షన్‌ టెన్షన్‌
x
Intermediate Exams
Highlights

ఇంటర్మీడియట్ విద్యార్దులకు సగం వార్షిక సంవత్సరం గడిచి పోయింది. పరిక్షల కోసం విద్యార్దులు కుస్తీ పడుతూ చదువుతున్నారు.

ఇంటర్మీడియట్ విద్యార్దులకు సగం వార్షిక సంవత్సరం గడిచి పోయింది. పరిక్షల కోసం విద్యార్దులు కుస్తీ పడుతూ చదువుతున్నారు. అయితే పరిక్షలు ఎంత బాగా రాసినా ఫలితాలు ఎలా ఉంటాయో అనే భయం విద్యార్దుల్లో నెలకొని ఉంది. అసలు పరిక్షలు బాగా రాసినా ఫలితాల విషయంలో విద్యార్దుల్లో ఎందుకు ఆందోళన? అందుకు ఇంటర్ బోర్డ్ ఏమంటుంది వాచ్ దిస్ స్టోరి..

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు అంటే విద్యార్దుల కంటే వారి తల్లిదండ్రులకు వణుకు పుడుతోంది. దానికి గత సంవత్సరం వచ్చన సమస్యలే కారణం. ముందుగా ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల కావడంతో ఒత్తిడి పెరిగి హడావుడిగా ఫలితాలు ప్రకటించారు. దీనితో చాలా చోట్ల తప్పిదాలు దొర్లాయి. చాలా మంది పాస్ అయినా ఫెయిల్ అని రావడం, ఒక వేళ పాస్ అయినప్పటికీ తక్కువ మార్కులు రావడం లాంటివి జరిగాయి. దీనితో విద్యార్దులు, వారి తల్లి దండ్రులు ఇంటర్ బోర్డ్ ముందు ఆందోళనలు చేశారు. కొంత మంది విద్యార్దులు ఫలితాలు చూసి ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.

ఇక చివరికి ప్రభుత్వమే విద్యార్దులందరికీ ఉచితంగా రీ వాల్యుయేషన్ చేయించింది. పరీక్షలకు ముందు డేటాను సరైన పద్ధతిలో పొందుపరచకపోవడం, అనుభవం లేని సంస్థకు బాధ్యతలను అప్పజెప్పడంతోనే ఈ సమస్య తలెత్తిందని భావించారు. చాలా మందికి మార్కులు చూపించకపోవడం లాంటివి సాంకేతిక తప్పిదమని తెలిసింది. అయితే ఈ తప్పిదాలను ఈసారి సరిదిద్దుకున్నామని ఇంటర్ బోర్డ్ చెబుతోంది. ఈ సారి ప్రభుత్వ రంగ సంస‌్థ అయిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కు పరిక్షల పూర్తి స్థాయి నిర్వహణను ఇచ్చారు. ఈ సారి ఇంటర్ విద్యార్దులు ఆందోళన చెందవద్దని ఇంటర్ బోర్డ్ కార్యదర‌్శి ఉమర్ జలీల్ చెబుతున్నారు. ఈ సారైనా విద్యార్దుల భవిష్యత్ ను దృష్టి లో ఉంచుకొని టెన్షన్ లేకుండా పరిక్షలు జరిపించి, ఫలితాలు ప్రకటించాలని అందరూ కోరుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories