Medchal: సుభాష్‌నగర్‌లో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే పర్యటనకు అడ్డంకి

Medchal: సుభాష్‌నగర్‌లో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే పర్యటనకు అడ్డంకి
x

Medchal: సుభాష్‌నగర్‌లో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే పర్యటనకు అడ్డంకి

Highlights

Medchal: మేడ్చల్ జిల్లా అల్వాల్ సర్కిల్ సుభాష్‌నగర్‌లో స్మశానవాటిక అభివృద్ధి పనుల పరిశీలనకు వచ్చిన ఎమ్మెల్యే రాజశేఖర్‌ను కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

Medchal: మేడ్చల్ జిల్లా అల్వాల్ సర్కిల్‌లోని సుభాష్‌నగర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్మశానవాటిక అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యే రాజశేఖర్‌ని... కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే స్మశానవాటికను పరిశీలిస్తున్న సమయంలో... రాజకీయ ఉద్దేశాలతో కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగడంతో అక్కడంతా గందరగోళ వాతావరణం ఏర్పడింది. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే పర్యటనను అడ్డుకోవడం తగదని స్థానికులు, టీఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడ్డారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories