సూర్యాపేట జిల్లా గుర్రంపోడు తండాలో ఉద్రిక్తత

సూర్యాపేట జిల్లా గుర్రంపోడు తండాలో ఉద్రిక్తత
x

ఫైల్ ఇమేజ్

Highlights

* పోలీసులపై రాళ్ల దాడికి దిగిన బీజేపీ కార్యకర్తలు * ఘర్షణలో కోదాడ డిఎస్పీ, సీఐకు గాయాలు * బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్

సూర్యాపేట జిల్లాలో బీజేపీ చేపట్టిన గిరిజన భరోసా యాత్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. సూర్యాపేట జిల్లా గుర్రంబోడు తండాలో ఆదివారం హైడ్రామా చోటు చేసుకుంది. ఈ యాత్రలో బీజేపీ నేతలు రాళ్లదాడి చేశారు. సర్వే నెంబర్ 540 భూములను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, విజయశాంతి, ఎమ్మెల్యే రాజాసింగ్, రఘునందన్ రావులు పరిశీలించారు. ఈ క్రమంలో వివాదాస్పద భూమిలో ఏర్పాటు చేసిన షెడ్లను గిరిజనులు, బీజేపీ నాయకులు ధ్వంసం చేశారు.

ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులపైకి బీజేపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో కోదాడ డీఎస్పీ, సీఐ సహా పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఊహించని పరిణామంతో అలర్ట్ అయిన పోలీసులు బీజేపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో అక్కడకు వచ్చిన బండి సంజయ్ గిరిజనులకు సర్ధి చెప్పడంతో గొడవ సద్దు మణిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories