కామారెడ్డి జిల్లా బిచ్కుందలో కొనసాగుతోన్న ఉద్రిక్తత

X
Highlights
* యువకుడు విజయ్‌ను ఢీ కొట్టిన ఇసుక లారీ * ప్రమాదంలో విజయ్‌కు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు * ఇసుక లారీల వేగంపై గ్రామస్తుల ఆగ్రహం
admin29 Dec 2020 2:49 AM GMT
రోడ్డుపై వెళ్తున్న యువకుడుని వేగంగా వస్తున్న ఇసుక లారీ ఢీ కొట్టిన ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన యువకుడు విజయ్‌ను గోపన్‌పల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిదంటున్న గ్రామస్తులు.. లారీ అద్ధాలను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఇసుక లారీకి నిప్పంటించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. అటు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తోంది.
Web Titletension in Bichkunda of Kamareddy district
Next Story