రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?

TRS: ఉమ్మడి పాలమూరులో సిట్టింగ్‌లకు గుబులు
TRS: 2018లో 13 స్థానాల్లో గులాబీ పార్టీ గెలుపు
TRS: గులాబీ నేతల్లో ఆందోళన మొదలైందా? అధినేత వేస్తున్న స్కెచ్‌లు, నిర్వహిస్తున్న సర్వేలు ఎవరికి శాపంగా మారబోతున్నాయి.? సీక్రెట్ సర్వేతో ఆ ఉమ్మడి జిల్లాలోని ఆరుగురు ఎమ్మెల్యేలకు అందుకే టెన్షన్ పట్టుకుందా? భవిష్యత్తులో ఆ నియోజకవర్గాల్లో సిట్టింగుల సీటు కనుమరుగు కానుందా? గులాబీ బాస్ రహస్య సర్వేలతో ఆందోళనకు గురవుతున్న నేతలు ఎవరు గులాబీ దళంలో ఆ సర్వే నిజంగానే కాక రేపుతుందా..? ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతోంది?
2018 అసెంబ్లీ ఎన్నికలు గులాబీ అధినేత కేసీఆర్ చరిష్మాతోనే జరిగాయి. ప్రతిపక్షాలన్నీ మహాకూటమిగా ఒకవైపు సీఎం కేసీఆర్ మరోవైపు అన్నట్టుగా ఎన్నికల్లోకి వెళ్లారు. అప్పటి పరిస్థితులు గులాబీ దళానికి అనుకూలించాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఒక్క సీటు మినహా 13 అసెంబ్లీ సీట్లను గెలుచుకొని విజయబావుటా ఎగురవేసింది. చాలా ప్రాంతాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోతారని ప్రచారం జరిగినా కేసీఆర్ చరిష్మాని వారిని గెలిపించిందన్న టాక్ వినిపించింది. కారు గుర్తు మీద పోటీ చేసిన వారిలో కొల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక్కరే ఓడిపోయారు. అయినా, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన హర్షవర్ధన్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకోవడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ 2018లో క్లీన్‌స్వీప్ చేసినట్టు అయ్యింది. అసెంబ్లీ ఎన్నికలే కాకుండా, ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో అయినా గులాబీ నేతలే హవా కొనసాగించారు. ప్రతిపక్షాలకు చోటివ్వకుండా విజయబావుట ఎగరవేశారు.
ఇంతవరకు బాగానే ఉంది. కానీ గతేడాది ఉన్న పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాన్న భావన గులాబీ దళంలో వినిపిస్తుంది. ఈసారి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై కొంత వ్యతిరేకత ఉన్నట్టు అధినేత నిర్వహించిన సర్వేలో తేలిందట. కేసీఆర్ సర్కార్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు పక్కన పెడితే కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల వ్యవహారశైలి పార్టీకి ప్రతిబంధకంగానే మారుతుందని తేలినట్టు సమాచారం. ఈ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ ఈసారి వెనకాడే అవకాశాలు లేకపోలేదని, వచ్చే ఎన్నికల్లో ఏకంగా ఆరు, ఏడు నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం రావొచ్చన్న చర్చ జరుగుతోంది. ఈ ఒక్క మాటే చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోందట.
మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఈ అలజడి మరీ ఎక్కువగా కనిపిస్తోందట. సీఎం కేసీఆర్ 119 నియోజకవర్గాల్లో సర్వే చేస్తున్నట్లు గులాబీ బాస్ ఉమ్మడి జిల్లాలోని ఆరు నియోజకవర్గాలపై మరింత కాన్సంట్రేషన్ చేస్తున్నారట. జిల్లాలోని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందన్న సర్వే నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. సర్వే నివేదికతో ఆ ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంగా ఉన్నా అధినేత సిట్టింగ్‌లకే మరోసారి అవకాశం ఇవ్వడమం కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని ఆ ఆరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేల అభ్యర్థుల పనితీరు పట్ల అధినేత ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారట. పనితీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
గతంలో అంటే 2018లో ఓడిపోతామని అనుకున్న అభ్యర్థులు కూడా కేసీఆర్ చరిష్మాతోనే గట్టెక్కారు. కానీ భవిష్యత్తులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అభ్యర్థులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందట. దీంతో ప్రతిపక్షంలో ఉన్న పార్టీల నేతలు కొందరు టీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది. సిట్టింగ్‌లకు టికెట్ రాకుంటే, తాము గులాబీ పార్టీలో చేరి టికెట్ సంపాదింకోవచ్చని ఎత్తుగడ వేస్తున్నారట. ఇది ఉమ్మడి జిల్లాలోని ఆ ఆరుగురు ఎమ్మెల్యేలకు గుబులు పుట్టిస్తుందట.
ఏమైనా గులాబీ రాష్ట్ర నాయకత్వం చేపడుతున్న రహస్య సర్వేల వల్ల ఉమ్మడి జిల్లా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వణుకు మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. భవిష్యత్తులో తమ పనితీరు మార్చుకోకుంటే కచ్చితంగా టికెట్ గల్లంతు అవుతుందని ఓ అంచనాకు వచ్చిన ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారట. దీంతో పాటు గులాబీ దళంలో చోటు సంపాదించేందుకు కొత్త నాయకత్వం కూడా ఆశగా ఆత్రుతగా ఎదురు చూస్తుండటంతో వారికి చాన్స్ ఇవ్వకుండా పావులు కదుపుతున్నారట. మరి భవిష్యత్తులో ప్రస్తుతమున్న సిట్టింగ్‌లకే అవకాశం దక్కుతుందా లేక కొత్త వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుందో చూడాలి.
హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ ఫ్లెక్సీలు!
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ..
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో జవాబులివ్వాలని సవాల్..
2 July 2022 12:30 PM GMTమోడీ భాగ్యలక్ష్మిని దర్శించుకుంటారా?
2 July 2022 11:48 AM GMTTalasani Srinivas Yadav: బీజేపీ సిద్ధమైతే.. అందుకు మేమూ రెడీ..
2 July 2022 11:15 AM GMTవయనాడ్ ఆఫీసు ధ్వంసాన్ని లైట్ తీసుకున్న రాహుల్
1 July 2022 12:30 PM GMT'ఆవో-దేఖో-సీకో'.. ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ
1 July 2022 12:15 PM GMT
Kishan Reddy: ఓవైసీ డ్రైవింగ్ చేస్తుంటే కేసీఆర్ పాలన సాగుతుంది
3 July 2022 11:45 AM GMTబీజేపీ సభ కోసం పరేడ్ గ్రౌండ్‌కు వచ్చిన గద్దర్..
3 July 2022 11:26 AM GMTBandi Sanjay: ఒక్క కుటుంబం చేతుల్లో తెలంగాణ నలిగిపోతోంది
3 July 2022 11:00 AM GMTPiyush Goyal: కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి
3 July 2022 10:49 AM GMTTelangana: ఖరీఫ్ సీజన్లో పత్తి, మిర్చి సాగుపై రైతుల ఆసక్తి
3 July 2022 10:45 AM GMT