జనసేనతో పొత్తు పై బీజేపీ నేతల్లో టెన్షన్..టెన్షన్‌

Tension Among BJP Leaders over Alliance with Janasena
x

జనసేనతో పొత్తు పై బీజేపీ నేతల్లో టెన్షన్..టెన్షన్‌

Highlights

BJP: ఢిల్లీ పెద్దల సమక్షంలో జాబితా ఫైనల్ చేయనున్న నేతలు

BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎమ్మెల్యే అభ్యర్థుల మూడో జాబితాను నవంబర్ 1 లేదా 2న ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన తెలంగాణ బీజెపీ ముఖ్య నేతలు.. మూడోజాబితా కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం.

రాష‌్ట్ర బీజేపీ నేతలు, బీజేపీ ఢిల్లీ పెద్దల సమక్షంలో జాబితా ఫైనల్ చేయనున్నట్టు సమాచారం. రెండు రోజుల పాటు లిస్ట్ పై జాతీయ నాయకత్వం కసరత్తు చేయనుంది. అనంతరం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో నేతలు జాబితాకు ఆమోదం తెలపనున్నారు. జనసేనతో పొత్తు పై బీజేపీ నేతల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పొత్తుల్లో ఏ నియోజకవర్గాలను జనసేనకు కేటాయిస్తారంటూ ఆశావహులు ఆరా తీస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాలను జనసేనకు కేటాయించొద్దంటున్నారు.

శేర్లింగంపల్లి టికెట్ రవి కుమార్ యాదవ్‌కే కేటాయించాలని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి...ధర్మపురి అరవింద్‌లతో పాటు మరికొందరు నేతలు పట్టుబడుతున్నట్టు సమాచారం. జనసేనకు శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాలు కేటాయిస్తే ఇబ్బందులు తప్పవంటూ నేతలు చెబుతున్నారు. బీజేపీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లోనే జనసేనకు టికెట్లు కేటాయించాలనే యోచనలో బీజెపీ ఉన్నట్లు సమాచారం. మరోసారి నవంబర్ ఒకటో తేదీన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం నిర్వహించనుంది. జనసేనకు సీట్ల కేటాయింపు పై సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. నవంబర్ 1 లేదా 2వ తేదీన బీజెపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories