కేంద్ర బడ్జెట్‌పై విభిన్నంగా స్పందంచిన తెలుగు రాష్ట్రాలు

Telugu States Reacted Differently to the Central Budget | Telugu Latest News
x

కేంద్ర బడ్జెట్‌పై విభిన్నంగా స్పందంచిన తెలుగు రాష్ట్రాలు

Highlights

Telugu States: *బడ్జెట్‌పై ఎటాక్‌ చేసిన సీఎం కేసీఆర్‌ *బడ్జెట్‌ ఆశాజనకంగా లేకున్నా సీఎం జగన్ మౌనం

Telugu States: కేంద్ర బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాల పార్టీల విభిన్నంగా స్పందించాయి. కేంద్ర బడ్జెట్‌పై కేసీఆర్ తీవ్రంగా విరుచుపడ్డారు. మొదట పనికి మాలిన, పసలేని, గోల్ మాల్ బడ్జెట్ అంటూ విరుచుకపడ్డారు. తనదైన శైలిలో గంటన్నర సేపు బడ్జెట్‌ను చీల్చిచెండాడారు. ప్రభుత్వంపైన. మోడీ పైన తీవ్రమైన విమర్శలు చేశారు. బడ్జెట్‌కు సంబంధం లేని అంశాలను తెచ్చి మోడీపై విమర్శలు చేశారు. ఇటీవలి కాలంలో కేసీఆర్ బీజేపీపై యుద్ధమే అన్న ఫార్ములా ఫాలో అవుతున్నారు కాబట్టి కేసీఆర్ ఘాటు స్పందనను చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేశారు.

కానీ ఏపీ సీఎం జగన్ బడ్జెట్‌పై స్పందించలేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కాస్తో కూస్తో బడ్జెట్‌ను విమర్శించారు. బడ్జెట్ ఆశాజనకంగా లేదని రైతులు, పేదలు.. కొవిడ్‌తో దెబ్బతిన్న రంగాలకు ఎలాంటి చేయూతనిస్తారో కూడా బడ్జెట్లో చెప్పలేదన్నారు. ఆహార సబ్సిడీని తగ్గించి పేదలపై భారం మోపుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో వైఎస్ఆర్‌సీపీ విఫలమయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. 28 మంది ఎంపీలు ఉండి ఏం సాధించారని విమర్శించారు.

ఢిల్లీలో విజయసాయిరెడ్డి మాత్రం స్పందించారు. ఈ బడ్జెట్ చాలా నిరుత్సాహ పరిచిందని ఎప్పట్లాగే చెప్పిన ఆయన .. అప్పుల విషయంలో మాత్రం కేంద్రంపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పులు తీసుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. రాష్ట్రానికి కూడా ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి మించి రుణాలు తీసుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories