Container School: మంత్రి సీత‌క్క నియోజ‌క‌వ‌ర్గంలో తొలి కంటైనర్ పాఠశాల

Telanganas First Container School In Mulugu
x

Container School: మంత్రి సీత‌క్క నియోజ‌క‌వ‌ర్గంలో తొలి కంటైనర్ పాఠశాల

Highlights

Container School: రాష్ట్రంలో తొలి కంటెయినర్ స్కూల్ అందుబాటులోకి వచ్చింది. తొలిసారిగా మలుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ స్కూల్‌ను కంటెయినర్‌లో ఏర్పాటు చేశారు.

Container School: రాష్ట్రంలో తొలి కంటెయినర్ స్కూల్ అందుబాటులోకి వచ్చింది. తొలిసారిగా మలుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ స్కూల్‌ను కంటెయినర్‌లో ఏర్పాటు చేశారు. ఈ పాఠ‌శాల‌ను పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి సీత‌క్క నిన్న ప్రారంభించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని కాంతనపల్లి అటవీ ప్రాంతంలో బంగారుపల్లి ఆవాస గ్రామం ఉంది. ప్ర‌స్తుతం గుడిసెలో న‌డుస్తున్న పాఠ‌శాల శిధిలావ‌స్త‌కు చేరుకుంది. అట‌వి ప్రాంతం కావ‌డంతో కొత్త పాఠశాల భవన నిర్మాణానికి అటవీ అధికారులు అనుమతులివ్వలేదు. దీంతో ఇక్క‌డ కంటెయిన‌ర్ పాఠ‌శాల ఏర్పాటుకు మంత్రి సీత‌క్క శ్రీకారం చుట్టారు.

ములుగు నియోజ‌క‌వ‌ర్గంలోని తాడ్వాయ్ మండ‌లంలో కంటైనర్ ఆసుప‌త్రిని మంత్రి సీత‌క్క అందుబాటులోకి తేవ‌డంతో స్థానిక ప్ర‌జ‌ల‌కు వైద్య సేవ‌లు అందుతున్నాయి. అదే కోవ‌లో ఇప్పుడు కంటేయిన‌ర్ పాఠ‌శాల‌ను ప్రారంభించారు. ఈ కంటెయినర్ పాఠశాల 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో ఇద్ద‌రు టీచ‌ర్లు ప‌నిచేస్తుండ‌గా..వారితో పాటు విద్యార్ధులు సౌక‌ర్య‌వంతంగా కూర్చునే విధంగా కంటేయిన‌ర్ పాఠ‌శాల‌ను అందుబాటులోకి తెచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories