Telangana: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో టీటీడీపీ అధ్యక్షుడు

TTDP L Ramana File Photo
x

రమణ ఫైల్ ఫోటో 

Highlights

Telangana: హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయనున్న రమణ.

తెలుగు రాష్టాల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ శాసనమండలి ఎన్నికల ప్రక్రియకు ఈసీ కోడ్ ప్రకటించనుంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు సిధ్ధంగా ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ(MLC Graduates Elections) ఎన్నికల బరిలో దిగుతున్నారు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఆయన పోటీ చేస్తున్నారు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎల్‌.రమణ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

ఏపీలో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటాలోని 6 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఫిబ్రవరి 25న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలు చేసేందుకు మార్చి 4 తుదిగడువుగా నిర్ణయించారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 8వరకూ గడువునిచ్చింది ఈసీ. మార్చి 15న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5గంటల నుంచి ఓట్లు లెక్కింపు ప్రారంభం కానుంది.

ముగిసిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఏపీలో మార్చి 29న నలుగురు ఎమ్మెల్సీలు రిటైర్‌ కానున్నారు. తిప్పేస్వామి, వెంకన్న చౌదరి, సంధ్యారాణి ,మహమ్మద్ ఇక్బాల్ రిటైర్‌ కానున్నారు. వీటితో పాటు పిల్లి సుభాష్ చంద్రబోస్‌ రాజీనామా చేయగా ఏర్పడిన స్థానానికి చల్లా రామకృష్ణా రెడ్డి మృతితో ఏర్పడిన స్థానానికి కూడా మార్చి 15న ఉప ఎన్నిక జరగనుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories